గత కొంతకాలంగా ఇండియాలో ఉల్లిధరలు అమాంతం పెరిగిపోయాయి.  ఇప్పుడు ఎవరి ఇంట్లో ఉల్లిపాయలు నిండుగా కనిపిస్తాయో వారే కోటీశ్వరుడు.. జీవితంలో హాయిగా జీవించే వ్యక్తి కూడా అతనే.  అప్పుడెప్పుడో ఉల్లిధరలు దేశాన్ని గడగడలాడించాయి.  ఉల్లిపాయలు కోయకుండానే కన్నీళ్లు తెప్పించి ప్రభుత్వాన్ని కూల్చేశాయి.  ఇప్పుడు మరోసారి ఉల్లిపాయలు ఘాటు పెరిగిపోతున్నది.  


దానికి కారణం ఉంది.  గత కొన్ని రోజులుగా దేశంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.  ఈ వర్షాల కారణంగా ఉల్లిపండించే రాష్ట్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  ఉల్లి దిగుమతి పడిపోయింది.  పంటలు నష్టపోతున్నారు.  నవంబర్ నెలలో ఉల్లిపంట చేతికి వస్తుంది.  కానీ, వర్షాలు కురుస్తుండటంతో... నవంబర్ లో పంట చేతికొచ్చే పరిస్థితి లేదు.  ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.  దీంతో దేశంలో కొన్ని మార్కెట్లలో ఉల్లి రేటు రూ. 60 రూపాయలు దాటిపోయింది.  


ఇదిలా ఉంటె, సెప్టెంబర్ నెలాఖరులో ఇతర దేశాలకు ఉల్లి ఎగుమతులు నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది.  దేశం నుంచి ఎక్కువుగా పాకిస్తాన్, బాంగ్లాదేశ్ వంటి దేశాలకు ఉల్లి సరఫరా అవుతుంది.  బాంగ్లాదేశ్ కు సరఫరా నిలిచిపోవడంతో అక్కడ ధరలు ఆకాశాన్ని అంటాయి. ఎగుమతి ఆగిపోవడంతో.. బాంగ్లాదేశ్ లో కింటా ధర పదివేలకు చేరుకుంది.  దీంతో అక్కడ ఉల్లి దొరకని పరిస్థితి ఎదురైంది.  


బాంగ్లాదేశ్ ప్రధాని ఇంట్లో కూడా ఉల్లి దొరకడం లేదని, ఉల్లిపాయ లేకుండానే భోజనం చేయాల్సి వస్తుందని చెప్పింది బాంగ్లాదేశ్ ప్రధాని.  ఎగుమతులు ఆపేస్తున్నట్టు నోటీసులు ఇచ్చారుగాని అప్పటికప్పుడు అత్యవసరంగా ఎగుమతులు ఆపడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.  చైనా, మయన్మార్ వంటి దేశాల నుంచి ప్రస్తుతం బాంగ్లాదేశ్ ఉల్లిని దిగుమతి చేసుకుంటున్నది.  అటు పాకిస్తాన్ కు కూడా ఇండియా ఉల్లిపాయల ఎగుమతులను నిలిపేసింది.  ఇప్పుడిప్పుడే ధరలు దిగివస్తున్నాయి.  ఉల్లిపాయలు ఇప్పుడు బంగారం కన్నా కూడా విలువైనవిగా మారిపోయాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: