1999 అనగానే మనకు గుర్తుకు వచ్చేది కార్గిల్ వార్.  పాక్ సైన్యం కార్గిల్ సెక్టార్ లోని హిల్స్ ఏరియాను ఆక్రమించుకుంది.  దీంతో ఇండియా అలర్ట్ అయ్యి పాక్ తో యుద్ధం చేయాల్సి వచ్చింది.  కార్గిల్ యుద్ధం జరిగే సమయానికి అక్కడ ప్రధానిగా నవాజ్ షరీఫ్ ఉన్నారు.  ఆర్మీ జనరల్ గా ముషారఫ్ ఉన్నారు.  పాక్ సైనికులు కార్గిల్ హిల్స్ ను ఆక్రమించుకోవడం వెనుక జనరల్ ముషారఫ్ ఉన్నారు.  పాక్ సైనికులు అలా చేస్తున్నప్పుడు ప్రధానికి ఈ విషయం తెలియదట.  


అంటే ప్రధానికి చెప్పకుండా అక్కడి సైన్యం ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటోంది.  దీన్ని బట్టి అక్కడ ప్రభుత్వంతో సైన్యానికి పనిలేదు.  సైన్యం చెప్పినట్టుగా ప్రభుత్వం నడుచుకోవాలి.  లేదంటే సైన్యం ప్రభుత్వాన్ని ఆక్రమించుకుంటుంది.  అందుకే పాక్ లో సుస్థిరమైన పాలన జరగడం లేదు.  అంతేకాదు, సైన్యం చెప్పినట్టుగానే ప్రభుత్వం నడుచుకోవాలి.  పేరుకు మాత్రమే ప్రధాని.. అధికారం సైన్యానిదే.  ఇప్పుడు కూడా అలానే జరుగుతున్నది.  పేరుకు ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పటికీ.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు.  ఇండియాతో కయ్యానికి కాలు దువ్వుతున్నాడు.  తెలిసి తెలియకుండా మాట్లాడుతున్నాడు.

ఇదిలా ఉంటె కార్గిల్ యుద్ధం తరువాత ఆర్మీ జనరల్ ముషారఫ్ ప్రభుత్వాన్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు.  ప్రధాని పదవిని రద్దు చేశాడు. తనను అధక్షుడిగా నియమించుకున్నాడు.  జనరల్ ప్రభుత్వమే నడవాలని స్పష్టం చేశారు.  చాలాకాలం పాటు జనరల్ ముషారఫ్ ప్రభుత్వాన్ని నడిపించాడు.  తరువాత సొంతంగా పార్టీని పెట్టి ఎన్నికలు నిర్వహించారు.  విచిత్రం ఏమిటంటే.. ఆ పార్టీ తరువాత ఓడిపోయింది.  


అనంతరం ముషారఫ్ దుబాయ్ వెళ్ళిపోయాడు.  ప్రస్తుతం అక్కడే ఉంటున్నాడు.  ఇటీవలే లండన్ వెళ్లి శస్త్రచికిత్స చేయించుకొని దుబాయ్ వచ్చారు.  ఇప్పుడు అయన తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని చూస్తున్నారు.  త్వరలోనే రాకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు.  ముషారఫ్ సైన్యాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉంది.  దేశంలో కలకలం రేపొచ్చు.  ఇమ్రాన్ ఖాన్ పదవికి ఎసరు పెట్టొచ్చు.  లేదా సైన్యం బలవంతంగా అధికారాన్ని చేజిక్కించుకోవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: