ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.  ఆర్టీసీ కార్మికులు చేస్తున్న డిమాండ్ కు ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన రాలేదు.  పైగా ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సహాయం అందుతుందని, పైగా ఇప్పుడు పండుగ సీజన్ అని, ఈ సమయంలో సమ్మె చేస్తే ఆర్టీసీకి చాలా నష్టం జరుగుతుందని ఆర్టీసీ యాజమాన్యం పేర్కొన్నది.  ఆర్టీసీ కార్మికులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో ఈరోజు నుంచి సమ్మె మొదలైంది.  


ఎక్కడి బస్సులు అక్కడే బంద్ అయ్యాయి.  బస్సులు బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.  ఇకపోతే, ఆర్టీసీ కార్మికులు బంద్ విరమించకపోతే.. ప్రైవేట్ బస్సులను, స్కూల్ బస్సులను రంగంలోకి దించుతోంది ప్రభుత్వం.  అంతేకాదు ఆర్టీసీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుపుతున్నట్టు పేర్కొన్నారు.  అంతేకాదు, ప్రతి బస్సుకు పోలీసు భద్రత ఉంటుందని ప్రభుత్వం చెప్తున్నది.  


అంతేకాదు, ఈరోజు సాయంత్రంలోగా కార్మికులు సమ్మె పక్కన పెట్టి విధులకు హాజరుకావాలని, లేదంటే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరిస్తోంది ప్రభుత్వం.  ఒక్కసారి విధుల నుంచి తొలగించబడ్డ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోబోమని స్పష్టం చేసింది.  కెసిఆర్ సానుకూలంగా స్పందిస్తారనుకుంటే ఇళ్ల సీరియస్ కార్మికులు సైతం సీరియస్ అయ్యారు.  


సమస్య పరిష్కారం అయ్యే వరకు ఎట్టి పరిస్థితుల్లో కూడా విధుల్లోకి వచ్చేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఇక తెలంగాణ కార్మికుల సంఘాలకు ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాల నుంచి మద్దతు లభిస్తోంది.  సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు.  ప్రైవేట్ వ్యక్తులు కూడా దీనికి సహకరించాలని ఆర్టీసీ కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలోనే హుజూర్ నగర్ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇలా సమ్మె చేయడంతో తెరాసకు ఇబ్బందులు తప్పేలా లేదు.  ఆర్టీసీ సమ్మెను కాంగ్రెస్ పార్టీ తో సహా ప్రతిపక్షాలు హుజూర్ నగర్ ఎన్నికల్లో ప్రధాన ఆయుధంగా చేసుకోబోతున్నాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: