సంక్షేమ పథకాలు పేదలకు చేరేలా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అవుట్ రీచ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. జి.ఎస్.టి అమలు తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని, పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్ల ధనం బ్యాంక్ లకు తిరిగొచ్చిందని, ఆ డబ్బు అంతా పేదలకు చేరేలా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వం లోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అన్నారు. ముద్ర ఋణ సదుపాయం ద్వారా చిన్న, మధ్య తరహా వ్యాపారులను ఆదుకొనే ఉద్దేశ్యం తో ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ గా ఎదిగేందుకు ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఆ దిశగా అడుగులు వేసే క్రమంలో చిన్న చిన్న వ్యాపారులను ఆదుకొని వారికి ఋణ సదుపాయం కల్పించి తద్వారా వారు ఎదిగేందుకు కృషి చేస్తోందని మంత్రి అన్నారు.



ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్ల ద్వారా రుణం కావల్సిన వారికి ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చని ఆయన అన్నారు. 
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ జాయింట్ సెక్రెటరీ  మద్నేష్ కుమార్ మిశ్రా మాట్లాడుతూ దేశంలో నోట్ల కొరత ఏర్పడిందని అనవసర ప్రచారం జరుగుతుందని , ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రధాన మంత్రి చెప్పినట్లుగా క్షేత్ర స్థాయిలో చర్చల ద్వారా క్రెడిట్ కల్చర్ ని పెంచుకోవచ్చని అన్నారు.  250 జిల్లాల్లో మొదటి దశలో , 200 జిల్లాల్లో రెండవ దశలో బ్యాంకింగ్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన తెలిపారు. 450 జిల్లాల్లో రెండు దశల్లో బ్యాంకింగ్ అవుట్ రీచ్ ఉండేలా రూపొందించబడిన ఈ కార్యక్రమంలో ఎన్‌బిఎఫ్‌సిలు, ఎంఎఫ్‌ఐలు, ఎస్‌హెచ్‌జిలు, ఎంఎస్‌ఎంఇలు, ముద్ర, రిటైల్ తో పాటు అగ్రి-క్లయింట్లు పాల్గొన్నారు.




పిఎస్‌బిల సామర్థ్యం, నిజ ఆర్థిక వ్యవస్థకు అర్హులైన అన్ని విభాగాలకు నిధులు సమకూర్చడానికి సన్నద్ధతను తెలియజేయడం ఈ కార్యక్రమం వెనుక ఉన్న స్ఫూర్తి. డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహం సహా ఆర్థిక చేరిక యొక్క లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈ కస్టమర్ అవుట్ రీచ్ ఇనిషియేటివ్ జరుగుతోంది. సమాజానికి సేవ చేస్తున్నప్పుడు ప్రభుత్వ రంగ బ్యాంకుల పునః స్థాపన మరియు రీబ్రాండింగ్ కు ఇది సహాయపడుతుంది. 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థకు బ్యాంక్ ప్రాధాన్యతలను గుర్తించడం ఈ కార్యక్రమం  ముఖ్య ఉద్ధేశ్యమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. వివిధ బ్యాంకుల ప్రతినిధులు , ఉన్నతాధికారులు , ఖాతాదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: