2014 ఎన్నికల సమయంలో బీజేపీతో టీడీపీ పొత్తుపెట్టుకుంది.  ఐతే, 2014 సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కు అనుభవం ఉన్న నాయకుడి అవసరం ఉన్నది కాబట్టి టిడిపికి ప్రజలు  గెలిపించారు.  కేంద్రంతో కొన్నాళ్ళు సఖ్యతగానే ఉన్నారు.  కానీ, కేంద్రం స్ట్రిక్ట్ గా ఉండటంతో బాబుకు సెట్ కాలేదు కేంద్రం నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు.  


ఆ సమయంలో బాలయ్యబాబు కూడా మోడీ గురించి పరుషంగా మాట్లాడిన సంగతి తెలిసిందే.  కేంద్రప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యమంత్రి చంద్రబాబు వేదికమీద ఉన్న సమయంలోనే బాలయ్య ప్రధాని గురించి కామెంట్లు చేశారు.  కర్యేషు దాసి, కరణేశు మంత్రి, భోజ్యేషు మాత, శయనేష రంభ అంటారని...ముందు పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలని, అద్వాణీని గౌరవించలేని వ్యక్తి మీరు అని విమర్శించారు. అంతేకాదు.. కట్టుకున్న భార్యను కూడా మీరు గౌరవించడం లేదని...ముందు భార్యను ప్రేమించడం నేర్చుకోవాలంటూ హితవు పలికారు. అమిత్ షా లాంటివారు పక్కన ఉండి డప్పు కొడుతుంటే... రోజులు గడిపేస్తున్నారని అన్నారు. ఒకప్పుడు బీజేపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే ఉండేవని... ఇప్పుడు బీజేపీ ఈ స్థాయిలో ఉండటానికి ఎన్టీఆర్, చంద్రబాబులే కారణమని ఆనాడు బాలయ్య పేర్కొన్నాడు.  


ఆనాడు కేంద్రానికి వ్యతిరేకంగా బాబు చేస్తున్న దీక్ష సమయంలో ఇలా బాలకృష్ణ కామెంట్లు చేశారు.  ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా బాబుపై నెటిజన్లు వివిధరకాల కామెంట్లు చేస్తున్నారు.  దీనిపై బాబు చాలా సీరియస్ అవుతున్నారు.  తనను అన్ని మాటలు అంటారా అని మండిపడుతున్నాడు.  నెటిజన్లు సీరియస్ అయితే తప్పేంది అని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అంటున్నాడు.  


గతంలో కేంద్రానికి వ్యతిరేకంగా, మోడీపై బాలకృష్ణ అందరి ముందు డైరెక్ట్ గా పరుషంగా మాట్లాడినపుడు కంట్రోల్ చేసి ఉంటె ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడే మాటలను కౌంటర్ ఇవ్వొచ్చు.  బాలయ్య మాట్లాడుతున్నప్పుడు నవ్వుతు చప్పట్లు కొట్టిన వ్యక్తికి సోషల్ మీడియాలో ఇలాంటి కామెంట్లే వస్తాయని అయన పేర్కొన్నారు. ఎవరి ఎన్ని మాట్లాడినా మోడీ గౌరవం తగ్గిపోదని.. ప్రపంచంలో మోడీకి రోజురోజుకు బలం పెరుగుతోందని అయన చెప్పుకొచ్చారు.   


మరింత సమాచారం తెలుసుకోండి: