అన్ని వస్తువుల ధరలు దేశంలో రోజు రోజుకు మారిపోతున్నాయి.  కొన్ని వస్తువులు నిత్యవసర వస్తువుల జాబితాలో చేరిపోయాయి.  అందులో ఒకటి పెట్రోల్.. పెట్రోల్ డీజిల్ నిత్యం చాల అవసరం.  సగటున ప్రతి మనిషి దీనిపై నెలకు కొంత వ్యయం చేస్తూనే ఉన్నాడు.  ఈరోజుల్లో వాహనాలు లేని ఇల్లు లేదు.  నెలకు కనీసం సగటున ఒక వ్యక్తి వెయ్యి నుంచి రెండు వేలు పెట్రోల్ కు వినియోగిస్తున్నారు.  


పెట్రోల్ వాడకం ఎక్కువ కావడంతో డిమాండ్ కు తగ్గట్టుగా సరఫరా ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  అప్పుడప్పుడు పెట్రోల్ ధరలు పెరుగుతుంటాయి తగ్గుతుంటాయి.  ఇది కామన్.  తాజాగా పెట్రోల్ తగ్గుముఖం పట్టాయి.  గత కొన్ని రోజులుగా దేశంలో ఈ పెట్రోల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి.  పెట్రిల్ ధరల తాజా రేట్లు ఇలా ఉన్నాయి.  


హైదరాబాద్ 
పెట్రోల్ ధర : రూ. 78.73 
డీజిల్ ధర : రూ.73.22
అమరావతి : 
పెట్రోల్ ధర : రూ. 78.32
డీజిల్ ధర : రూ. 72.47
విజయవాడ:
పెట్రోల్ ధర : రూ. 77.95
డీజిల్ ధర : రూ. 72.13
 
ఢిల్లీ : 
పెట్రోల్ ధర : రూ. 74.04
డీజిల్ ధర : రూ. 67.15
ముంబై: 
పెట్రోల్ ధర : రూ. 79.65
డీజిల్ ధర : రూ. 70.39 


ఇక ఇదిలా ఉంటె, అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి.  క్రూడాయిల్ ధరలు పెరిగినా దేశంలో పెట్రోల్ ధరలు తగ్గడం విశేషం.  పెట్రోల్ ధరలను పెంచకుండా చూసుకుంటే ప్రభుత్వాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.  అయితే, గత కొంతకాలంగా గల్ఫ్ లో యుద్దవాతావరణం నెలకొనడంతో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 


ఇందుకోసమే సౌదీతో పాటుగా ఇండియా అటు అమెరికా, రష్యా దేశాల నుంచి కూడా ముడిచమురును ఇండియాకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నది.  అంతేకాదు, సౌదీకి అరాంకో నుంచి కొంత ముడి చమురును జామ్ నగర్ లో ఉన్న రిలయన్స్ చమురు శుద్ధి కర్మాగారానికి సరఫరా చేసేందుకు రిలయన్స్ తో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది.  అక్కడి నుంచి ముడి చమురు జామ్ నగర్ చమురు శుద్ధి కర్మాగారానికి సరఫరా అయితే.. ఇండియాలో పెట్రోల్ ధరలు మరింతగా తగ్గే అవకాశం ఉంటుంది.  ఇండియాలో కూడా అపారమైన సహజవాయువు, చమురు నిక్షేపాలు ఉన్నాయి.  వాటిని వెలికితీయగలిగితే.. ఇండియాలో పెట్రోల్ ధరలు మరింతగా తగ్గిపోతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: