ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులకు మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె సైరన్  మోగించారు . రాష్ట్ర వ్యాప్తంగా గత రాత్రి ప్రారంభమైన ఆర్టీసీ సమ్మె తో  బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. తమ డిమాండ్లకు ప్రభుత్వం సరైన పరిష్కారం అందించే వరకు సమ్మె విరమించేది లేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసింది . ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా కీలక నిర్ణయం తీసుకున్నారు... ఈ రోజు సాయంత్రం ఆరు గంటల లోపు సమ్మె విరమించి విధుల్లో హాజరయ్యే కార్మికులను   మాత్రమే ఆర్టీసీ కార్మికులుగా  పరిగణిస్తామని మిగతా వారిని ఉద్యోగం నుండి తొలగిస్తామని స్పష్టం చేసింది ప్రభుత్వ . అయితే ప్రయాణికులు రద్దీ  దృశ్య ప్రైవేటు వాహనాలు నడుపుతామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. 

 

 

 

 

 

కాగా  డిపోల దగ్గర ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ అమలు చేశారు అధికారులు. కాగా ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో పండుగకు ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా... ఆర్టిస్ లో ఇప్పటికే కొనసాగుతున్న అద్దె బస్సులతో పాటు దసరా సెలవులు కావడంతో విద్యాసంస్థల బస్సులను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించింది ప్రభుత్వం.

 

 

 

 

 రాష్ట్రంలోని అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ అమలు చేసినప్పటికీ కార్మికులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉదయం నుంచి డిపోల వద్ద ధర్నా చేస్తున్న కార్మిక సంఘాల నేతలు... ప్రైవేటు బస్సులు తిరగకుండా ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. దీంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. కాగా పోలీసుల భద్రత తో  కొన్నిచోట్ల ప్రైవేటు వాహనాలు రోడ్డుపైకి వస్తుండగా మరోవైపు... ప్రైవేటు వాహనాలను అడ్డుకుంటున్న కార్మికులను 144 సెక్షన్ అమలులో ఉండటంతో అరెస్ట్  చేస్తున్నారు పోలీసులు. ఏదేమైనా ఆర్టీసీ సమ్మె ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: