ఈనెల 21 వ తేదీన మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ ఎన్నికల్లో తిరిగి ఎలాగైనా గెలిచి అధికారాన్ని సొంతం చేసుకోవాలని బీజేపీ చూస్తున్నది.  గతంలో కంటే మహారాష్ట్రలో బీజేపీ చాలా బలపడింది.  బీజేపీ బలపడటానికి ఒకిందుకు శివసేన పార్టీనే కారణం అని చెప్పొచ్చు.  1985 వ సంవత్సరం తరువాత బీజేపీ శివసేనతో పొత్తు పెట్టుకుంది.  బీజేపీతో పొత్తు పెట్టుకున్నాక.. అక్కడ మెల్లిగా బలపడటం మొదలుపెట్టింది.  


భవిష్యత్తులో మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకోవచ్చు అనే దానిపై బీజేపీకి స్పష్టమైన అవగాహన వచ్చింది. ఈ అవగాహనతోనే అప్పటి నుంచి ఎదగడం మొదలుపెటింది.  బీజేపీ మరోవైపు ఆర్ఎస్ఎస్ అండ పుష్కలంగా ఉంది.  ఆర్ఎస్ఎస్.. శివ సేనల అండతో బీజేపీ ఎదిగింది.  1985 నుంచి రెండు పార్టీల మధ్య పొత్తు కొనసాగుతూనే ఉన్నది.  ఇప్పటి వరకు ఆ పొత్తు విడిపోలేదు.  


ఇకపై భవిష్యత్తులో కూడా ఈ రెండు పార్టీల మధ్య పొత్తు విడిపోదని కలిసే పనిచేస్తారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.  బలమైన నాయకత్వం, పార్టీని సమర్ధవంతంగా నడిపించే నాయకులు ఉంటె పార్టీలు ఎప్పుడు బలంగానే ఉంటాయి.  ఒకప్పుడు మహారాష్ట్రలో బలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బలహీనపడింది.  గతంలో లేనంతగా బలహీనపడింది.  ఇది పార్టీని ఇబ్బందుల్లో పడేసింది.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలో కూడా లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  


2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఓటమికి భాద్యత వహిస్తూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాజీనామా చేశారు.  నాటకీయ పరిణామాల మధ్య అయన రాజీనామాను అంగీకరించాల్సి వచ్చింది.  గాంధీ కుటుంబమే కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులుగా ఉండాలని పార్టీ నాయకులు కోరుకోవడంతో సోనియాగాంధీ తప్పనిసరి పరిస్థితుల్లో తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టింది.  ఇప్పుడు సోనియా, రాహుల్ గాంధీలు మహారాష్ట్ర ప్రచారాన్ని భుజాన వేసుకున్నారు.  ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాలి.  ఈ సమయంలో బీజేపీని ఎదుర్కోవడం అంటే మాములు విషయం కాదు.  చూద్దాం ఏం జరుగుతుందో.  


మరింత సమాచారం తెలుసుకోండి: