ప్రతి మనిషీ సీనియర్ సిటిజన్ అవుతారు. మనం వాళ్లని సరిగ్గా చూసుకోకపోతే రేపు మనల్ని చూసుకోవడానికి ఎవరూ ఉండరు’ అన్న వ్యాఖ్యలు హృదయమున్న ప్రతి ఒక్కరినీ ఆకట్టుకున్నాయి. ఈ మాటలన్నది ఎవరో కాదు మాట తప్పని.. మడమ తిప్పని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి.  వృద్దుల కోసం నలుగురితో సీనియర్ సిటిజన్ కౌన్సిల్‌ను ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. వారంతా నెలకో సారి తమతో మాట్లాడే వ్యవస్థ రూపొందిస్తామన్న సీఎం జగన్ ప్రకటించారు.



దీనితో వృద్ధుల పట్ల  ఆయన వైఖరి ఏంటన్నది బహిర్గతమైంది. ఇందులో  ఓ కొడుకు తండ్రిపై ఉన్న వాత్సల్యం మాదిరిగా కనిపించింది. అదే విధంగా  ప్రతి ఆడపిల్ల డిగ్రీ చదవాలంటున్నారు. ఆ తర్వాతే ఆడపిల్లకు పెళ్లి అయితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 21 ఏళ్లకు ఆడపిల్ల పెళ్లిచేసుకోవాలన్న ప్రచారం విస్తృతంగా చేయని సీఎం జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో రక్తహీనత సమస్య అధికంగా ఉంది. తక్కువ వయసులో పెళ్ళికారణంగా పుట్టే పిల్లలకూ ఆరోగ్య సమస్యలు ఉంటున్నాయ’న్నారు. ఇవన్నీ జగన్.. ఒక ఇంటి పెద్దగా మాట్లాడినట్లే అనిపించాయని మహిళలు స్పందిస్తున్నారు.



ప్రధానంగా వృద్ధులపై ఆయన చేసిన వ్యాఖ్యలు, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ ఏర్పాటుచేస్తామన్న హామీ ఇవ్వడంపై ప్రతి ఇక్కర్ని ఆకట్టుకుంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ మాటలు తన వైఖరిని  స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా 21 ఏళ్లకు ఆడపిల్లకు పెళ్లి చేయాలన్న దానిపై ప్రచారం చేయాలన్న సూచన, రక్తహీనతతో బాధపడుతున్న మహిళల ఆరోగ్యం కోసం తన ప్రభుత్వం నిధులకు వెనుకాడదని చేసిన ప్రకటన, వారి పట్ల జగన్‌కు ఉన్న అనురాగం ఏమిటన్నది స్పష్టమయింది.ఇక ఆడపిల్లల భవిష్యత్తు, వైవాహిక జీవితంపైనా జగన్ చేసిన ఆసక్తికర ప్రకటన ఒక ఇంటి పెద్దన్నను గుర్తు చేశాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: