సోషల్ మీడియా సామాన్య జనాలకంటే రాజకీయ నేతల కౌంటర్లకు అడ్డాగా మారింది అనిపిస్తుంది. బహిరంగ సభల నుండి సోషల్ మీడియా వేదికకు పాకింది వీరి మాటల యుద్ధం.
అధికార ప్రతి పక్ష పార్టీలు ఒకరికొకరు పిర్యాదులు చేసుకుంటూ.....పోస్టింగులు పెట్టుకుంటున్నారు. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ నేతలు సోషల్ మీడియాలో అభ్యంతకర పోస్టులు పెడుతున్నారంటూ వైఎస్సార్‌సీపీపై మండిపడ్డారు. 


తనతో పాటూ తన కొడుకు లోకేష్, ఇతర టీడీపీ  నేతలపై ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు.  అయితే ఈ వ్యాఖ్యలకు వైఎస్సార్‌సీపీ కూడా ఘాటుగా స్పందించింది.
ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి చంద్రబాబు, లోకేష్‌ టార్గెట్‌గా రెచ్చిపోయారు. ‘సోషల్ మీడియా వాల్స్‌పై ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు పోస్ట్ చేస్తారు అది వారి ఇష్టం. మీకు అంతగా  అనాగరిక దూషణలనిపిస్తే  పేస్ బుక్ కి  ఫిర్యాదు చేసుకోండి అంతేగాని పోస్ట్ పెట్టినవాళ్ల మీద కాదు.చంద్ర‘జ్యోతి’ ఎన్ని మంటలు రాజేయాలని చూసినా లాభం లేకుండా పోయినట్టుంది అదే కదా మీ అసలు బాధ అంటూ కౌంటర్ ఇచ్చారు. 


మీ పప్పు పుత్ర పెట్టిన ట్వీట్లు సుమతి శతకాల్లా కనిపిస్తున్నాయా బాబు గారూ?’అంటూ ఎద్దేవా చేశారు. .‘సిగ్గు లేని బతుకులు ఎవరివో ఐదుగురి పేర్లు చెప్పమంటే మీ తండ్రీకొడుకుల పేర్లు ముందుంటాయి.
ఆ లిస్టులో కిరసనాయిలు తప్పని సరిగా ఉంటాడు. అంతగా అన్‌పాపులర్ అయ్యారు వీళ్లు.  ప్రజాస్వామ్యం, మీడియా స్వేచ్ఛకు మీ సొంత నిర్వచనాలు పెట్టుకుంటారా .. ఈ జన్మలో మారరా?అంటూ మండిపడ్డారు. వైఎస్సార్సీపైన, మా ముఖ్య మంత్రి గారిపైన నీచపు రాతలు రాసేందుకు వేల మందిని నియమించుకున్నారు.

అది చాలదన్నట్టు  24/7 కాల్ సెంటర్లను నిర్వస్తున్నారంటూ ఆరోపించారు. మీ బానిస పత్రికలు, చానళ్లు ఎంత దాచి పెట్టినా సోషల్ మీడియా మీ అరాచకాలన్నిటినీ బయట పెడుతుంది, అందుకేనా ఈ ఏడుపు?’అంటూ కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి.ఈ మాటల యుద్ధం ఇంతటితో ఆగేలా లేదు.....  విజయసాయిరెడ్డి ఇచ్చిన కౌంటర్ కి రికౌంటర్ ఇవ్వడానికి ఏ టీడీపీ నేత రెడీ గా ఉన్నారో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: