గత కొంత కాలంగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ పై ఎన్నో ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.   కొంత కాలం ఆయన అజ్ఞాతంలో ఉంటూ వస్తున్నారు.  టీవీ9లో అధిక భాగం వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా సంస్థ రవిప్రకాశ్‌పై ఫోర్జరీ, తప్పుడు పత్రాల సృష్టి, లోగో విక్రయం ఆరోపణలతో సైబర్‌క్రైమ్‌, బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 

తాజాగా పోలీస్ విధులకు ఆటంకం కలిగించారని రవిప్రకాశ్ పై ఆరోపణలు వచ్చాయి. గతంలో టివి స్టూడియోకు వచ్చిన టైంలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని అభియోగం. ఈ నేపథ్యంలో రవిప్రకాశ్ ని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కాగా, గతంలో టీవీ9 మాతృసంస్థ ఏబీసీఎల్‌లో మేజర్ వాటాలు కొనుగోలు చేసిన అలందా మీడియా.. రవిప్రకాశ్ పైన ఫోర్జరీ, తప్పుడు డాక్యుమెంట్స్ సృష్టి, లోగో విక్రయం ఆరోపణలతో సీసీఎస్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన చేశారు. అప్పట్లో ఈ వార్తలు సెన్సేషన్ సృష్టించాయి. తాజాగా ఇప్పుడు రవిప్రకాశ్ ని బంజారా హిల్స్ పోలీసులు అరెస్ట్ చేయడం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: