అలందా మీడియాతో వాటాల వివాదంలో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను అరెస్ట్ చేసే దిశగా పోలీసులు ఎప్పటి నుండో కసరత్తు చేస్తున్నారు.వాటాల విక్రయం, ఫోర్జరీ, తప్పుడు పత్రాలసృష్టి, లోగో విక్రయం ఆరోపణలతో ఆయనపై పోలీసులు కేసులు నమోదు చేసి,విచారణకు హాజరవ్వాల్సిందిగా నోటీసులు ఎన్ని సార్లు పంపినగాని వీటికి స్పందించని రవిప్రకాశ్, నెల రోజులకు  పైగా ఆజ్ఞాతంలోకి వెళ్లి.ఆతర్వాత హఠాత్తుగా విచారణకు హాజరై పోలీసులకు దర్యాప్తులో ఏ మాత్రం సహకరించడం లేదన్న విషయం తెలిసిందే.దర్యాప్తులో బాగంగా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవడం, దాటవేత ధోరణి అవలంబించడం చేసారు.



ఇవే అంశాలతో పోలీసులు నివేదిక సిద్ధం చేశారు.. మరోవైపు ఈ కేసులో ఏ2 నిందితుడు శివాజీ ని చేర్చారు.మరోవైపు టీవీ9 మాజీ సీఎఫ్‌వో మూర్తి కూడా సీసీఎస్ విచారణకు హాజరవుతున్నారు.ఇక ఈ సందర్భంలో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌కు బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీచేశారు. టీవీ9 లోగో విషయంలో కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని అలందా మీడియా డైరెక్టర్ కౌశిక్ రావు ఫిర్యాదు చేశారు. దీంతో 41 సీఆర్పీసీ కింద నోటీసులు జారీచేశారు.ఇప్పటికే ఇటు ఫోర్జరీ, అటు కాపీరైట్ కేసులతో టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు.



ఈ నేపద్యంలో ఈ రోజు అంటే అక్టోబర్ ఐదొవ తారీఖున బంజారహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసారు.ఇక ఇన్నాళ్లుగా దోబూచు లాడుతున్న ఈ కేసు ఇప్పుడు రవిప్రకాశ్ అరెస్ట్‌తో ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలియడం లేదు.ఇక ఇన్నాళ్లూ అందరికీ నీతులు చెప్పిన రవి తాను మాత్రం ఓ అరాచక వాదిగా నిరూపించుకున్నారు. తనపై ఎన్ని కేసులు నమోదైనా, పోలీసులు ఎన్ని నోటీసులు ఇచ్చినా విచారణకు హాజరయ్యేది లేదని ఎదురుతిరిగారు. పోలీసులు ఎక్కడ అరెస్టు చేస్తారో అన్న భయంతో ఇన్ని రోజులు తప్పించుకు తిరిగారు.చివరికి ఈ రోజు ఎట్టకేలకు రవి కధకు తెరపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: