టీవీ9 వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో రవిప్రకాశ్ ఎప్పుడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటారు. టీవీ9 సీఈవో గా ఉన్నప్పుడు రవిప్రకాష్ ఎన్నో ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన మీద ఎన్నో కేసులు కూడా నమోదయ్యాయి. కాగా రవి ప్రకాశ్ మీద నమోదైన కేసులకు కోర్టుకు హాజరవ్వాల్సి ఉండగా...కేసుల నుండి తప్పించుకునేందుకు కొన్ని రోజులు అండర్ గ్రౌండ్ లో కూడా ఉన్నారు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్. ఆ తర్వాత టీవీ9 సీఈఓ పదవికి రాజీనామా చేశారు. 

 

 

 

 

 అయితే తాజాగా టీవీ9 వ్యవస్థాపకుడు,  మాజీ సీఈవో రవిప్రకాశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు ఏమిటి అనే కారణం చెప్పకుండానే రవిప్రకాష్ ను అరెస్టు చేసి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు  తరలించారు పోలీసులు. టీవీ9  మాజీ సీఈవో రవిప్రకాశ్ అరెస్ట్ కలకలం రేపుతోంది. అసలు ఏ కారణంగా రవిప్రకాష్ ను అరెస్ట్ చేసి ఉంటారు అనే అనుమానం కలుగుతుంది. 

 

 

 

 

 అయితే  రవి ప్రకాష్ ఇంటికి వెళ్ళిన 10 మంది పోలీసుల బృందం అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించి రవిప్రకాష్ ను అదుపులోకి తీసుకున్నారు. కనీసం అరెస్టు చేయడానికి గల కారణం కూడా పోలీసులు రవిప్రకాష్ తెలుపలేదు. అసలు ఏ సెక్షన్ కింద అరెస్టు చేస్తున్నారని కూడా చెప్పకుండా రవిప్రకాష్ ను అరెస్టు చేశారూ పోలీసులు. అయితే రవిప్రకాష్ ను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పోలీసులు  తరలించగా  ... అక్కడ  రవి ప్రకాష్ ని ఎసిపి  విచారిస్తున్నట్లు సమాచారం. పోలీసుల విధులకు భంగం కలిగించడం వల్లే  రవిప్రకాష్ ను అరెస్ట్ చేసి ఉంటారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అయితే టీవీ9 వ్యవస్థాపకుడు మాజీ  సీఈఓ రవిప్రకాష్ తో పాటు పోలీసులు మోజో టీవీ మాజీ సీఈవో రేవతిని కూడా విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: