దసరా పర్వదినానికి ముందుగానే  కేబుల్ టీవీ యూజర్లకు  అఖిల భారత  డిజిటల్ కేబుల్ ఫెడరేషన్(ఏఐడీసీఎఫ్) పెద్ద తీపి కబురును అందించింది. అదేంటంటే  కేవలం నెలకు రూ.130 చెల్లిస్తే చాలంట. 150 ఛానెళ్లు వీక్షించే అవకాశాన్ని కల్పించేందుకు సిద్ధమైంది. కేబుల్ టీవీ ప్రొవైడర్ల అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకోవడంతో వినియోగదారులకు పండగ ముందు శుభవార్త అందింది. కేబుల్ టీవీ ప్రొవైడర్లు ప్రస్తుతం రూ. 130 నెట్ వర్క్ కెపాసిటీ ఫీజు వసూలు చేస్తున్నారు. కాగా, భారతదేశంలో 80శాతం కేబుల్ యూజర్లకు ఆల్ ఇండియా డిజిటల్ కేబుల్ ఫెడరేషన్(ఏఐడీసీఎఫ్) సేవలు అందిస్తోంది.



హాత్ వే డిజిటల్, ఇన్ డిజిటల్, సిటీ నెట్‌వర్క్స్, జీటీపీఎల్ హాత్‌వే, ఫాస్ట్‌వే ట్రాన్స్‌మిషన్, డీఈఎన్ నెట్‌వర్క్స్, యూసీఎన్ కేబుల్, ఆర్టెల్ కమ్యూనికేషన్స్, ఐసీఎన్‌సీఎల్, ఏషియానెట్ డిజిటల్, కేరళ కమ్యూనికేటర్స్ కేబుల్ ఏఐడీసీఎఫ్ లో సభ్యులుగా ఉన్నాయి.
కాగా, తమ సభ్యులందరూ చర్చించుకుని రూ. 130 నెట్ వర్క్ కెపాసిటీ ఫీజుతో సబ్ స్క్రైబర్లకు 150 ఎస్డీ ఛానళ్లు ఇచ్చేందుకు నిర్ణయించారని ఏఐడీసీఎఫ్ అధ్యక్షుడు ఎస్ఎన్ శర్మ వెల్లడించారు. అయితే, ఈ నిర్ణయానికి ట్రాయ్ ఆమోదం ఉందా? లేదా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.




ఇది ఇలావుంటే, రూ. 130 తీసుకుని యూజర్లకు 100 ఛానెళ్లు ప్రొవైడ్ చేయాలని టెలికామ్ రెగ్యూలేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) షరతు విధించింది. ఇందులో ఫ్రీ టూ ఎయిర్ ఛానెళ్లతోపాటు పెయిడ్ ఛానళ్లు కూడా ఉంటాయి. వినియోగదారులు రూ.130+జీఎస్టీ చెల్లిస్తే సరిపోతుంది. ఒకవేళ 50ఛానళ్లు ఎక్కువ కావాలనుకుంటే రూ. 40 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఏఐడీసీఎఫ్ నిర్ణయానికి ట్రాయ్ అనుమతి ఉన్నట్లయితే.. ఇక వినియోగదారులు రూ. 130కే 150 ఛానళ్లు చూసే అవకాశం అందుబాటులోకి రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: