మరో రసవత్తర ఎన్నికల పోరుకు తెరలేచింది. మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించడంతోనే రాజకీయాలు వేడెక్కాయి. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న మహారాష్ట్రలో రాజకీయ సమీకరణాలపై మరింత స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ.ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం ప్రకటన విడుదల చేసింది.ఇక పోతే మహారాష్ట్ర.హరియాణా రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల వేడి రోజు రోజుకు రాజుకుంటుంది.ఇక ఎన్నికల కమీషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన ప్రకారం,హరియాణాలో 90సీట్లకు,మహారాష్ట్రలో 288 సీట్లకు పోలింగ్ జరగనుంది.



అదేవిధంగా అక్టోబర్ 21వ తేదీన రెండు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతాయి.అక్టోబర్ 24వ తేదీన కౌంటింగ్ జరుగుతుందని ఎన్నికల కమీషన్ పేర్కొన్నది.ఇక ఈ ఎన్నికల్లో ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిస్తున్నట్టు ఎన్నికల కమీషన్ పేర్కొనడం విశేషం. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 64 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగబోతున్నాయి.అక్టోబర్ 21 వ తేదీన తెలంగాణలోని హుజూర్ నగర్ స్థానానికి ఉపఎన్నిక జరగనుంది.కాగా మహారాష్ట్రలో 288, హరియాణాలో 90 స్థానాలకు అక్టోబరు 21 పోలింగ్ నిర్వహించి ఫలితాలను ఇదే నెల 24 వెల్లడించనున్నట్టు ప్రధాన ఎన్నికల కమిషనర్ సునిల్ అరోరా తెలిపారు.



ఇక అక్టోబరు 4 వరకు అంటే నిన్నటివరకు నామినేషన్లను స్వీకరించారు..అక్టోబరు 5 నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు గడవు 7 తేదీగా నిర్ణయించారు.అలాగే.. మహారాష్ట్రలో 8.94 కోట్ల మంది, హరియాణాలో 1.82 కోట్ల మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారని సీఈసీ వెల్లడించారు. ఎన్నికల కోసం భద్రతా బలగాలను మోహరించనున్నారు. మహారాష్ట్రలోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలైన గడ్చిరోలి, గొండియాలో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేస్తామని సునీల్ అరోరా పేర్కొన్నారు.అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున వీవీప్యాట్‌లను లెక్కించనున్నట్టు ఈ సందర్భంగా సునీల్ అరోరా స్పష్టం చేశారు.ఇక ఈ ఎలక్షన్స్‌లో విజయం ఎవరిని వరిస్తుందోనని ఇప్పటికే రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: