టీవీ 9 మాజీ సీఈవో రవి ప్రకాష్ అరెస్ట్ అయ్యారు. హైదరాబాద్‌లో బంజారా హిల్స్ పోలీసులు రవి ప్రకాష్ ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలతో పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు.  ప్రస్తుతం బంజారా హిల్స్ పోలీసులు రవి ప్రకాష్‌ను విచారిస్తున్నారు. గతంలో టీవీ 9 స్టూడియోకు వచ్చిన సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని రవి ప్రకాష్ పై కేసు నమోదైంది.


ఇప్పటికే రవి ప్రకాష్ పై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో రెండు కేసులు నమోదయ్యాయి. టీవీ 9 నిధుల గోల్ మాల్ జరగడం, టీవీ లోగోలని విక్రయించడంపై ఆయన మీద గ‌తంలో కేసులు పెట్టారు.  ఈ కేసులు నిమిత్తం చాలాసార్లు ఆయని పోలీసులు విచారించారు. ఆ విచార‌ణ‌లోనే ఆయ‌న త‌న వెర్ష‌న్ వినిపించారు.
కాగా, టీవీ9 నిధుల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న నెపంతో ఛానల్‌ను టేకోవర్ చేసిన అలంద మీడియా టీవీ 9 నుంచి రవి ప్రకాష్‌కు ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే.


గ‌తంలో టీవీ 9 నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై పలుసార్లు పోలీసులు రవి ప్రకాష్ ని విచారణ చేశారు కూడా. కానీ ఇప్పుడు పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే అభియోగంతో రవి ప్రకాష్ ని అదుపులోకి తీసుకున్నారు. కొద్ది రోజులుగా ర‌విప్ర‌కాష్ బీజేపీ స‌హ‌కారంతో సౌత్‌లో అన్ని భాష‌ల్లో కొత్త మీడియా స్టార్ట్ చేస్తున్నార‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి.


ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల టీవీ9 నుంచి జాఫ‌ర్‌ను సైతం బ‌య‌ట‌కు పంపించేశారు. జాఫ‌ర్ త‌ర‌చూ ర‌విప్ర‌కాష్‌ను క‌లుస్తున్నార‌న్న కార‌ణంతోనే ఆయ‌న్ను కొత్త యాజ‌మాన్యం బ‌య‌ట‌కు పంపేసిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ టైంలో ర‌విప్ర‌కాష్ త్వ‌ర‌లోనే కొత్త మీడియా సంస్థ‌ను స్థాపిస్తున్నార‌ని.. తెలంగాణ‌లో అధికార పార్టీ టార్గెట్‌గా ఈ మీడియా ప‌ని చేస్తుంద‌న్న వార్త‌ల నేప‌థ్యంలో ఆయ‌న్ను మ‌ళ్లీ ఏదో ఒక కార‌ణం సాకుగా చూపి అరెస్టు చేయ‌డం, మీడియా, రాజ‌కీయ వ‌ర్గాల్లో సంచ‌ల‌నంగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: