శుక్రవారం నాడు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైఎస్ఆర్ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించిన సంగతి అందరికి తెలిసిందే కదా. ఏలూరు కలెక్టర్ ఆఫీసు ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియంలో.. జగన్  సొంతంగా ఆటో, క్యాబ్‌ కలిగి వున్న ఆటోడ్రైవర్లకు రూ.10 వేలు ఆర్థిక సాయం చేశారు. గతంలో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం చేస్తామని.. పాదయాత్ర సమయంలో ఏలూరులో ఉన్నప్పుడే హామీ ఇచ్చిన జగన్.. ఇప్పుడు అదే నగరంలో వాహన మిత్ర పథకాన్ని కూడా ప్రారంభించడం జరిగింది.

 ఇక అసలు విషయానికి వస్తే పథకం మొదలై  24 గంటలు కూడా అవ్వక ముందే మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు చేయడం మొదలు పెట్టారు. పథకాల్లో లోపాలను ఎత్తి చూపిస్తూ సోషల్ మీడియాయిని  వేదిక చేసుకొని ట్విట్టర్‌లో విరుచుకుపడ్డారు. ‘వైఎస్సార్ వాహన కక్ష పథకం చూసి ఆటో డ్రైవర్లు భయపడుతున్నారు జగన్ గారూ.

మీ ప్రభుత్వం పెట్టిన నిబంధనలు, అడుగుతున్న సర్టిఫికెట్ల కోసం తిరిగే డబ్బుతో కొత్త ఆటో నే కొనవచ్చు అంటూ విమర్శలు చేశారు. రాష్ట్రంలో మొత్తం సుమారుగా 6.63 లక్షల మంది ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారు.‘అలాంటప్పుడు మీరు వాళ్ళకి ఇచ్చిన హామీ ప్రకారం పథకం అమలుకు రూ.663 కోట్లు కేటాయించాలి. అలాంటిది ప్రభుత్వమే రూ.400 కోట్లు మంజూరు చేసిందంటే  అసలు అర్థం ఏమిటి? అర్హులను తగ్గించమనే కదా! అధికారులు ఇంకాస్త పెంచి  1.73 లక్షలకు కుదించారు’ అంటూ విమర్శించారు.

‘మ్యానిఫెస్టోలో లేని నిబంధనలన్నీ పథకం అమలు చేసేటప్పుడు ఎందుకు పుట్టుకొస్తాయి జగన్ గారూ? ఇది ప్రజలను మోసం చేయడం కాదా? లేక మోసం చెయ్యడం మీకు కొత్త ఆమె కాదు కాబట్టి, ఇప్పుడు కూడా అలాగే చేసాం అంటారా? సమాధానం ఇవ్వండి’ అని అన్నారు నారా లోకేష్.



మరింత సమాచారం తెలుసుకోండి: