ఇక పాకిస్థాన్‌లో పాలకుల కంటే సైన్యం నిర్ణయమే శిరోధార్యమనేది సత్యం. అక్కడ మిలటరీ చెప్పినట్టే నేతలు వింటారు, నడుచుకుంటారు. పాలకులను ప్రజలు ఎనుకున్నా పెత్తనం మాత్రం సైన్యానిదే. దీనిపై అమెరికా కాంగ్రెస్ సైతం ఇటీవల సంచలన విషయాలను వెల్లడించింది.  ఇది ఇలా ఉండగా  తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయి పాకిస్థాన్ ఇమ్రాన్ ఖాన్ బయటపడేస్తారని భావించిన పాక్ ప్రజలు ఆయనకు ఎన్నికల్లో పట్టంకట్టారు. అయితే, వారి ఆశలు మాత్రం  అడియాశలయ్యాయి. ఆ దిశగా ఇమ్రాన్ ప్రభుత్వం చర్యలు తీసుకుపోగా, ద్రవోల్బణం ఐదేళ్ల కనిష్ఠానికి పడిపోయింది.

ఈ నేపథ్యంలో పాక్ సైన్యం ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి రంగంలోకి దిగిందని విస్మయం కలిగించే ప్రచారం సాగుతోంది. దేశంలోని ముఖ్యమైన పారిశ్రామికవేత్తలతో పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా సమావేశమైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలియచేస్తు ఉన్నాయి. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే తీసుకోవాల్సిన చర్యల గురించి  మూడుసార్లు వీరితో ఆయన సమావేశమైనట్టు తెలుస్తోంది. పాక్ ఆర్ధిక రాజధాని కరాచీ, రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశాలు జరిగినట్టు తెలిపారు.

ఆర్ధిక సంక్షోభం నుంచి బయటపడాలంటే ఏం చేయాలని, పెట్టుబడులను ఆకర్షించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలని ఈ సమావేశాల్లో పాల్గొన్న వ్యాపారవేత్తలను బజ్వా సలహా అడిగినట్లు తెలుస్తుంది. అంతేకాదు, ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వ అధికారులకు సైతం సూచనలు చేసినట్టు కూడా సమాచారం. 
పాకిస్థాన్ ఏర్పడిన దగ్గర నుంచి ప్రభుత్వంపై సైన్యం పలుసార్లు తిరుగుబాటు చేసింది. దీని ప్రభావంతో ఆర్ధిక వ్యవస్థ కుదేలయ్యింది.

ఈ నేపథ్యంలో రక్షణ రంగానికి కేటాయింపులు తగ్గిపోయాయి. అయితే, దేశ పాలనా వ్యవహారాల్లో సైన్యం జోక్యాన్ని అక్కడ వ్యాపారవేత్తలు, ఆర్ధిక నిపుణులు స్వాగతించడం విశేషం. కానీ, వీరి పాత్ర మితిమీరితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, అభివృద్ధికి చోటు ఉండదనే ఆందోళన వ్యక్తమవుతోంది. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ ప్రభుత్వాలు ఏర్పడినా ఆర్మీ కీలక పాత్ర పోషిస్తోంది. 72 ఏళ్ల స్వాతంత్ర పాక్ చరిత్రలో సగం కాలం సైనిక పాలనలో ఉంది. పాక్‌లో తాజా పరిస్థితులపై నేతలు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: