దేశాన్ని ఏక చక్రం మీద తిప్పాలి అంటే బి.జె.పి కి ఉన్న ఒకే ఒక్క ఆయుధం హిందూత్వం. హిందూత్వమే మహా ఆయుధంగా నమ్ముతున్న శివసేన..ఇప్పుడు ఆ హిందూత్వ ఎజెండాయే బీజేపీని, శివసేనను కలిపి ఉంచుతోందని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌ తెలియచేశారు. రెండు పార్టీల కలయిక విజయం చేకూరుస్తుందనే విశ్వాసం వ్యక్తంచేశారు.శుక్రవారం ముంబైలో ఆయన మీడియా తో మాట్లాడుతూ చెప్పిన దాని బట్టి చూస్తే. మొత్తం 288 సీట్లలో శివసేన 124,ఎన్డీయే మిత్రపక్షాలైన ఆర్పీఐ, ఆర్‌ఎస్పీలు 14, బీజేపీ 150 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు.

రెబల్‌ అభ్యర్థులను రెండు రోజుల్లోగా వారి నామినేషన్లను ఉపసంహరించుకోవాల్సిందిగా కోరతామని, లేకపోతే వారి స్థానమేంటో వారికే చూపిస్తామని చాలా ఘాటుగా తెలిపారు.ఈ నేపథ్యంలో పార్టీ సీనియర్‌నేత ఖడ్సేకు టికెట్‌ రాకపోగా, ఆయన కుమార్తె రోహిణికి ముక్తయినగర్‌లో సీటు కేటాయించారు. ఖడ్సే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు.ఆదిత్య భారీ విజయం ఖాయం అంటూ వస్తున్న ఆదరణకు అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని కూడా వారు పేర్కొన్నారు.

శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కుమారుడు ఆదిత్య భారీ మెజార్టీతో గెలుస్తారని ఫడ్నవిస్‌ కూడా అన్నారు. ఉద్ధవ్‌ ఠాక్రే మాట్లాడుతూ" పార్టీ కార్యకర్తలు ఆదిత్యను సెక్రటేరియట్‌లోని ఆరో అంతస్తులో (ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రులు ఉండే చోటు) చూడాలనుకుంటున్నారని తన మనసులోని కోరికను తెలిపారు. ఆదిత్య రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని కూడా చాలా ఘాటుగా స్పష్టం కూడా ఆయన తెలిపారు. రెండు పార్టీల్లో పెద్దన్న (ఆధిపత్య పార్టీ) ఏదన్న చర్చలు లేనేలేవని పేర్కొన్నారు.ఇలా అందరం కలిసి మెలసి మహారాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకోవాలి అంటూ,మనందరం ఐక్యంగా ఉంటూ శివసేన పార్టీ ని,మహారాష్ట్ర గౌరవాన్ని కూడా నిలబెట్టాలి అంటూ వారు పేర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: