ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని  అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా వినూత్న పథకాలను ప్రవేశపెడుతూ పాలనలో తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర అభివృద్ధి,  సంక్షేమం కోసం ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రజలు మద్యానికి బానిసై జీవితాలు నాశనం చేసుకోవద్దనే  ఉద్దేశంతో సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులు వేసింది  వైసీపీ ప్రభుత్వం. 

 

 

 

 

 ఇప్పటికే ప్రవేట్ మధ్యం  దుకాణాలు అన్నీ మూసేసి... ప్రభుత్వ మద్యం దుకాణాలను  తీసుకొచ్చింది. అలాగే మద్యం షాపుల పని వేళలను  కూడా కుదించింది. మధ్యం ధరలను  కూడా భారీగా పెంచేసింది ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి నిర్ణయంతో మందుబాబులకు పెద్ద షాక్ తగిలినట్టైంది. అయితే మద్యం షాపులు నిర్వహించే సమయం రాత్రి 8 గంటల వరకు కుదించడం... రాష్ట్రంలో ఎక్కడా బెల్టుషాపులు నిర్వహించకుండా చూసుకోవడం లాంటి నిర్ణయాల  వల్ల మందుబాబులకు పెద్ద షాక్ తగిలింది. 

 

 

 

 

 ఈ నేపథ్యంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది ఎక్సయిజ్ శాఖ . ఇప్పటికే మద్యం షాపుల సమయాన్ని 8 గంటల వరకు కుదించగా... మద్యం షాపులు లాగే బార్ ల సమయాన్ని కూడా కుదించాలని  ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం బార్లలో విక్రయాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతున్నాయి. అయితే రాత్రి 11 గంటల తర్వాత బార్లలో మధ్యం  విక్రయించ వద్దని నిబంధన ప్రభుత్వం పెట్టినప్పటికీ వాటిని అతిక్రమించి మరి మద్యం విక్రయాలు జరుపుతున్నారు . ఈ నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బార్లు నిర్వహించే సమయాన్ని  కూడా కుదించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసింది ఎక్సైజ్ శాఖ... త్వరలోనే దానిని సీఎం జగన్ ముందుకు తీసుకెళ్ళనుంది . ఒకవేళ బార్ల సమయాన్ని కూడా కుదిస్తే మందుబాబులకు ఇక తిప్పలే.

మరింత సమాచారం తెలుసుకోండి: