కలెక్టర్‌గా ఆయనకు మంచి గుర్తింపు.... ఏ అంశమైనా కుండబద్దలు కొట్టినట్లుగా మాట్లాడే నైజం. కానీ ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం వద్దనుకుంది. కానీ ఏపీ ప్రభుత్వం పిలిచి ఏకంగా ప్రభుత్వ సలహాదారుడి పదవి కట్టబెట్టింది. ఇతర సలహాదారుల మాదిరి అన్ని రకాల జీత భత్యాలు రెండు లక్షల జీతం.. ఇతర అలవెన్సులతో కలిసి 1.82 లక్షలు కేటాయించింది. ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ఏపీలోనే కాదు తెలంగాణలోనూ చర్చకు కారణమైంది. 


జగన్ ఆలోచన ఏంటి..ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ గా ఉన్న సమయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. కొన్ని వర్గాల ఐఏఎస్‌లకు ప్రాధాన్య పోస్టులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు వాస్తవమేనంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరి కొన్ని వ్యాఖ్యల కారణంగా ప్రభుత్వం ఆయన్ను తెలంగాణ స్టేట్ ఆర్కీవ్స్ కార్యదర్శిగా ప్రాధాన్యత లేని పోస్టులో నియమించింది. ఆ తరువాత ఆయన ప్రభుత్వం ఐఏయస్ అధికారుల పై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని ఓపెన్ గా వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం నిర్ణయం మార్చుకోలేదు. 


ఫలితంగా ఆయన ఇక సర్వీసులో ఉండరాదని తన ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణకు నిర్ణయం తీసుకున్నారు. మరో పది నెలల పదవీ కాలం ఉండగానే ఆకునూరి మురళి జూలై 27న స్వచ్చంద పదవీ విరమణకు దరఖాస్తు చేయగా.. సెప్టెంబర్ 16న తెలంగాణ ప్రభుత్వం ఆమోదించింది. ఆ సమయంలో దేశంలోని చాలా రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ అధ్వాన్నంగా ఉందన్నారు. తెలంగాణలో కూడా స్కూళ్లలో మౌలిక వసతులు సరిగ్గా లేవని మురళీ తెలిపారు.అయితే, ఆయనకు ప్రాధాన్యత లేని పోస్టు ఇవ్వటమే కారణమా..లేక ప్రభుత్వంతో ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే విషయం మాత్రం స్పష్టత రాలేదు. .



తమ ప్రభుత్వ మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మురళీ వీఆర్ యస్ తీసుకున్న వెంటనే ఆమోదించి..తెలంగాణ ప్రభుత్వం వదిలించుకుంది. తాజాగా ఆకునూరి మురళీకి ఏపీ పాఠశాల విద్య (మౌళిక వసతుల కల్పిన ) సలహాదారుడిగా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే..తెలంగాణ ప్రభుత్వ వద్దు అనుకున్న అధికారిని ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఎందుకు ప్రాధాన్యత ఇచ్చారు.. అందునా ఏకంగా సలహాదారుడి పదవి ఇచ్చారనే అంశం పైన చర్చ సాగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: