వైఎస్ జగన్ మంత్రివర్గంలో తొలిసారి చోటు దక్కించుకున్న మహిళా మంత్రుల్లో కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత ఒకరు. రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు జగన్ శిశు సంక్షేమ బాధ్యతలు అప్పగించారు. గోపాలాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు వారసురాలుగా రాజకీయాల్లోకి  అరంగ్రేటం చేసిన వనిత..2009 లో టీడీపీ నుంచి గోపాలాపురం ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2012లో టీడీపీకి రాజీనామా చేసి ఆమె జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.


ఇక 2014లో వైసీపీ నుంచి కొవ్వూరులో పోటీ చేసి ఓడిపోయిన వనిత...2019 ఎన్నికల్లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి మంత్రిగా ఛాన్స్ కొట్టేశారు. అయితే మంత్రిగా వనిత నాలుగు నెలల పనితీరుని ఒక్కసారి గమనిస్తే...తొలిసారి మంత్రి కావడం వల్ల ఆమెకు అనుభవం తక్కువైందననే చెప్పాలి. పూర్తిగా శాఖ మీద గ్రిప్ తెచ్చుకోలేదని అనిపిస్తుంది. తొలిసారి మంత్రి పదవి చేపట్టిన వారితో పోలిస్తే వనిత కొంచెం వెనుకబడి ఉంది.


అసలు నాలుగు నెలల కాలంలో ఆమె పెద్దగా హైలైట్ అయిన సందర్భాలు ఏమి లేవు. పైగా ప్రతిపక్షాలు చేసే విమర్శలని తిప్పికొట్టడంలో పూర్తిగా విఫలమయ్యారు. అయితే శాఖాపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. గర్భిణులు, పిల్లల తల్లులకు, చిన్నారులకు అందించే పౌష్టికాహారంలో ఏ మాత్రా రాజీపడకుండా చూసుకుంటున్నారు. అలాగే బాల సదనం, స్త్రీ సదనాలను ఆకస్మాత్తుగా తనిఖీలు చేయడం, వాటిల్లో లోపాలు సరిచేయడం చేశారు.


అదే విధంగా జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే జిల్లాకు ఒక వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మొత్తం మీద ఇలాంటి చిన్న చిన్న నిర్ణయాలు తప్ప, వనిత తన శాఖలో పెద్ద మార్పులు వచ్చే నిర్ణయాలు ఏమి జరగలేదు. మొత్తానికి వనిత మంత్రిగా విజయం సాధించడానికి ఇంకొంత సమయం పట్టేలా ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: