అది 2003  లక్ష మంది ప్రభుత్వ ఉద్యోగులని ఒక్క కలం పోటుతో తీసి పారేశారు. ఇప్పుడే అదే పరిస్థితి తెలంగాణ ఆర్టీసీ కార్మిక ఉద్యోగులకు రానుందా ? ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించే హక్కు ఎవరికీ ఉంది? అదే ఎస్మా ..... అత్యవసర సేవల నిర్వహణ చట్టం. శాంతి భద్రతల పరిరక్షణ, ప్రజా జీవనానికి అంతరాయం కలగకుండా ఉండడం కోసం ఈ చట్టం ఉంది.    ఎస్మా ప్రకారం సమ్మెకు పోతే ఉద్యోగాలు పోవడం ఖాయం. ఆ అధికారం ప్రభుత్వానికి ఉంది. తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు పోరాడుతున్నాయు.



దీంతో తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించుకోవాలని  హెచ్చరిస్తూ, ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సైతం చేస్తూ ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
 సమ్మెను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ప్రభుత్వం ఆపివేసేందుకు, అణిచివేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆర్టీసీలో పనిచేసే వాళ్లందరూ కార్మికులందరూ పబ్లిక్ సర్వెంట్లే. చట్టంలోని ఓ సెక్షన్ ఇదే విషయం చెబుతోంది. గతంలో తమిళనాడులో జయలలిత సీఎంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులు సమ్మెకు వెళ్లినపుడు నిర్దాక్షిణ్యంగా ఎస్మా ప్రయోగించి దాదాపుగా లక్ష మందిని  ఉద్యోగాల నుంచి తొలగించారు.అలా  ప్రజాగ్రహానికి గురైన జయలలిత తరువాతి ఎన్నికల్లో చేదు అనుభవాన్ని చవిచూడాల్సి వచ్చింది.


ఇప్పుడు జయలలిత బాటలో పండుగ సమయంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్టీసీ కార్మికులు తమ విధులను బహిష్కరించిన నేపథ్యంలో ప్రజా జీవనానికి అంతరాయం కలుగుతుంది కాబట్టి ఎస్మా ను ప్రయోగించాలి అనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్లుగా తెలుస్తోంది.  కార్మికుల సమస్యలు పరిష్కరించడానికి గులాబీ బాస్ కెసిఆర్ అసలు ఏ మాత్రం చొరవ చూపలేదు అని తాజా హస్తిన పర్యటన చేస్తున్న ఆయన తీరును చెప్పకనే చెబుతుంది.ఇక అలాంటి సమయంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు కెసిఆర్ ఎప్పుడో సమస్యలు పరిష్కరిస్తారు అంటే నమ్మే స్థితిలో లేరు.

 తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి కెసిఆర్ ఇప్పుడు చొరవ తీసుకోవాలి అనేదే కార్మికుల ఆలోచన.కానీ కార్మికుల ఆందోళన అణచివేసే ప్రయత్నం చేస్తూ ఎస్మా ప్రయోగించే ఆలోచన లో ఉన్నారు కెసిఆర్. ఒకవేళ అదే గనుక జరిగితే ఆందోళన మరింత ఉధృతమవుతోందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: