హుజూర్‌న‌గ‌ర్ అసెంబ్లీ ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్లాన్ ఏంటీ.. ఆయ‌న ఎలా ముందుకు పోతున్నారు.. అస‌లు ఈ ఉప పోరులో చంద్రాలు వేస్తున్న ఎత్తుగ‌డ‌లు ఏమిటీ.. అస‌లు మిత్ర‌ధ‌ర్మాన్ని విస్మ‌రించి, శ్ర‌తువు గెలుపు కోసం ప‌నిచేస్తున్నారా.. అస‌లు టీడీపీ ఈ ఎన్నిక‌ల‌తో టీడీపీ నాయ‌కుల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు ఏ మెసేజ్ ఇవ్వ‌ద‌లుచుకున్నారు చంద్రాలు.. అస‌లు ఈ ఎన్నిక‌ల్లో వేస్తున్న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు చంద్రాల‌కు లాభ‌మా.. న‌ష్ట‌మా..?  చంద్రాలు టీడీపీని తెలంగాణ‌లో బ‌తికేంచేందుకా.. లేక ఉన్న పార్టీని మొత్తం తుడిచిపెట్టె కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారా.. ?  


ఈ ఎన్నిక‌ల‌తో కొత్త రాజ‌కీయ పొత్తుల‌కు తెరలేపారా..?  తెలంగాణ‌లో పోటీ చేసి భ‌విష్య‌త్‌లో ఏపీలో రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం ఈ ఎన్నిక‌ల‌ను ఉప‌యోగించుకోనున్నారా..?  అస‌లే జిత్తులమారి ఎత్తులు వేయ‌డం.. అవ‌స‌రం కోసం రాజ‌కీయ కుయుక్తులు ప‌న్న‌డం... అవ‌స‌రం తీరాక కాలితో త‌న్న‌డంలో సిద్ధ‌హ‌స్తుడు చంద్రాలు... ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగింది ఇదే.. మ‌రి ఈ ఎన్నిక‌ల్లో చంద్రాలు వేస్తున్న రాజ‌కీయ ఎత్తుగ‌డ‌లు ఏంటో ఓసారి ప‌రిశీలిస్తే చంద్రాలు వేస్తున్న ఎత్తులు తెలిస్తే షాక్ కావాల్సిందే..


తెలంగాణ టీడీపీ నేత‌ల‌తో చంద్రాలు శ‌నివారం సాయంత్రం ఎన్టీఆర్ ట్ర‌స్ట్ భ‌వ‌న్‌లో సుధీర్ఘ మంత‌నాలు జ‌రిపారు. ఇందులో హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో తీసుకోవాల్సిన ఎత్తుగ‌డ‌ల‌ను పార్టీ శ్రేణుల‌కు దిశానిర్ధేశం చేశారు. ఏకంగా హుజూర్‌న‌గ‌ర్ ఎన్నిక‌ల‌కు ఇన్‌చార్జీలను నియ‌మించారు చంద్రాలు... తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి, కొత్తకోట ప్రభాకర్ రెడ్డి, అరవింద్ కుమార్ గౌడ్, భూపాల్ రెడ్డి, దుర్గ ప్రసాద్ , బక్క నర్సింహులులను హుజూర్ నగర్ కు పార్టీ బాధ్యులుగా చంద్రబాబు నిర్ణయించారు.


అయితే చంద్రాలు ఇన్‌చార్జీల‌ను నియ‌మించి కాంగ్రెస్‌ను దెబ్బ తియాల‌ని ఎత్తుగ‌డ వేశార‌ట‌. దీనికి తోడు చంద్రాలు బీజేపీకి లోపాయికారిగా  ప‌నిచేసి, అటు టీ ఆర్ ఎస్ అభ్య‌ర్థిని దెబ్బ తీయ‌డం ద్వారా తెలంగాణ సీఎం కేసీఆర్‌కు రిట‌ర్న్ గిప్ట్ ఇవ్వ‌డం, ఇటు ఏపీ సీఎం జ‌గ‌న్‌ను రాజ‌కీయంగా దెబ్బ తీయాలంటే కేసీఆర్ పార్టీ ఓడిపోవ‌డం ద్వారా ఒక్క దెబ్బ‌కు రెండు పిట్ట‌లు అనే సిద్ధాంతంను అమ‌లు చేయ‌నున్నాడ‌ట‌.


అదే క్ర‌మంలో బీజేపీని తెలంగాణ‌లో పెంచుకునేందుకు ఈ ఎన్నిక అవ‌కాశం క‌లిగేలా వారితో లోపాయికారిగా ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌, బీజేపీలో చేరిన త‌న తాబేదార్ ఎంపీలు సుజ‌నాచౌద‌రి, టీజీ వెంక‌టేశ్‌, సీఎం ర‌మేష్‌ల ద్వారా తెలంగాణ బీజేపీ నాయ‌క‌త్వానికి స‌మాచారం చేర్చేలా.. దీని ద్వారా బీజేపీ ఆది నాయ‌క‌త్వంలో దృష్టితో చంద్రాలు ప‌డేలా చేయ‌డం కోస‌మే ఈ రాజ‌కీయ ఎత్తుగ‌డ అనే కుటిల య‌త్నమ‌ట‌.


ఏపీలో సీఎం జ‌గ‌న్‌తో పీఎం మోడికి స‌న్నిహిత సంబంధాలు ఉన్న నేప‌థ్యంలో అటు హుజూర్‌న‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో బీజేపీకి లోపాయికారిగా ప‌నిచేస్తే జ‌గ‌న్‌తో బీజేపీ సంబంధాలు తెంపుకుంటార‌నేది చంద్రాలు ఆలోచ‌న‌ట‌.. ఏదేమైనా ఒక్క ఎన్నిక‌ల‌తో ఎన్నో జిత్తుల మారి ఎత్తులు వేసి రాజ‌కీయ ల‌బ్ధి పొందాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌... సో చంద్రాలు ఎత్తులు ఏమేర‌కు ఫ‌లితం ఇస్తాయో వేచి చూడాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: