మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సై ని ప్ర‌త్యేకంగా క‌ల‌వ‌డం రాజకీయంగా సంచ‌ల‌నం క‌లిగిస్తుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డం ప‌ట్ల ఎందుకు క‌లిసారు.. త‌మిళ‌నాడుకు చెందిన గ‌వ‌ర్న‌ర్‌ను క‌ల‌వ‌డంలో ఉన్న విశేషం ఏంటి.. సాధార‌ణంగా మెగాస్టార్ ఎవ‌రైన ప్ర‌ముఖుల‌ను క‌లిసాడ‌టంటే దానిపై ఏదో ప్ర‌త్యేక‌మైన విశేషం ఉంటుంద‌నే టాక్ వినిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి గ‌వ‌ర్న‌ర్ త‌మిళ సైని క‌లువ‌డంతో బీజేపీలో చేరుతారా.. లేక సైరా సినిమా ను చూడ‌మ‌ని ఆహ్వానించ‌డానికేనా అనే సందేహాలు క‌లుగుతున్నా, బ‌ల‌మైన కార‌ణం ఉంద‌నే టాక్ కూడా వినిపిస్తుంది...


మెగాస్టార్ చిరంజీవి సైరా  సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఉన్న‌ప్పుడు బీజేపీ నేత‌లు ప‌లుమార్లు క‌లిసి పార్టీలోకి రావాల‌ని ఆహ్వానించారు. ఏపీలో బీజేపీని బ‌లోపేతం చేసేందుకు జాతీయ స్థాయిలో మెగాస్టార్‌కు ప్రాధాన్య‌త ఇస్తామ‌ని, ఏపీలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌చారం చేస్తామ‌ని కానీ త‌ప్ప‌కుండా బీజేపీలో చేరాల‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ,  జాతీయ స్థాయి అగ్ర‌నేత‌ అమిత్ షా నుంచి దూత‌ల‌ను మెగాస్టార్‌ను క‌లిసి చ‌ర్చించారు. దానికి నేను ఇప్పుడు సినిమా షూటింగ్‌తో బిజిగా ఉన్నాను. ఇది స‌మ‌యం కాదు.. సినిమా పూర్తి అయిన త‌రువాత అప్పుడు తీరిక‌గా క‌లుసుకుని చ‌ర్చిద్దామ‌ని చెప్పిన‌ట్లు గ‌తంలో విస్తృతంగా మీడియాలో, సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది.


ఈ ప్ర‌చారాన్ని అటు మెగాస్టార్ కాని, ఇటు బీజేపీ శ్రేణులు కాని ఖండించ‌లేదు. క‌నీసం వివ‌ర‌ణ కూడా ఇవ్వ‌లేదు. అంటే మౌనం అర్థాంగికారం అన్న‌ట్లుగా  బీజేపీ మెగాస్టార్  చిరంజీవికి ఆఫ‌ర్ చేసింది నిజ‌మేన‌ని తేలిపోయింది. అయితే ఇప్పుడు మెగాస్టార్ సైరా సినిమా భారీ విజ‌యం సాధించిన నేప‌థ్యంలో మంచి జోష్‌లో ఉన్న‌మెగాస్టార్ చిరంజీవికి ఇదే మంచి అద‌నుగా బీజేపీ వైపుకు చూపు సారించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది.


అయితే బీజేపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కురాలుగా ఉండి ఇటీవ‌లే తెలంగాణ గ‌వ‌ర్న‌ర్‌గా వ‌చ్చిన త‌మిళ సైని మెగాస్టార్ చిరంజీవి క‌ల‌వ‌డంతో మెగాస్టార్ బీజేపీ వైపు వెళుతున్నార‌నే సంకేతాలు ఇచ్చిన‌ట్లు అయింది. అయితే మెగాస్టార్ చిరంజీవి గ‌వ‌ర్న‌ర్‌ను కేవ‌లం మ‌ర్యాద‌పూర్వ‌కంగానే కలిసిన‌ట్లు, అంతే కాకుండా సైరా చిత్రాన్ని త‌మిళ వెర్ష‌న్‌లో గ‌వ‌ర్న‌ర్ కుటుంబం  చూసేందుకు ప్ర‌త్యేక షో వేస్తామ‌ని చెప్ప‌గా,  అందుకు గ‌వ‌ర్న‌ర్ ఓకే చెప్పిన‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. కేవ‌లం మెగాస్టార్ గ‌వర్న‌ర్‌ను మ‌ర్యాద‌పూర్వకంగా కలిస్తే దాదాపుగా 40నిమిషాల స‌మ‌యం మాట్లాడ‌టం జ‌రుగుతుందా.. కేవలం సినిమా విష‌యం అయితే ఓ ఐదో ప‌దో నిమిషాలు స‌మ‌యం తో విష‌యం తేలిపోతుంది.


కానీ ఇది ప‌క్కా రాజ‌కీయ క‌ల‌యికే అనేది సుస్ప‌ష్టం. అందుకే చిరంజీవి గ‌వ‌ర్న‌ర్ ద్వారా బీజేపీ ఆదిష్టానంకు మెసెజ్ పంపిన‌ట్లు ప్ర‌చారం జ‌రుతుంది. మెగాస్టార్ చిరంజీవి బీజేపీకి ద్వారాలు తెరిచి ఉంచిన‌ట్లే అని ఇప్పుడు గ‌వ‌ర్న‌ర్‌తో క‌ల‌వ‌డం ద్వారా తెలుస్తోంది. అయితే మెగాస్టార్ చిరంజీవి ఎప్పుడు బీజేపీ తీర్థం పుచ్చుకుంటారో అనేది తెలియాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: