ఎక్కడైనా పాలలో నీళ్లు కలిపితే మహా అంటే ఒక తిట్టు తిడుతారు. అయినా తగ్గక పోతే ఆ పాల వాడిని తీసేసి మరో పాల వాడిని పనిలోకి పెట్టుకుంటారు. కానీ ఢిల్లీలో మాత్రం విచిత్రంగా పాలలో నీళ్లు కలిపాడని ఆరు నెలల జైలు శిక్ష వేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాలను పలచన చేసి అమ్మడు అని ఓ వ్యక్తికి సుప్రీం కోర్టు ఆరునెలల జైలు శిక్ష విధించింది. 


ఆహార కల్తీ నిరోధక చట్టానికి సంబంధించిన కేసుల్లో జాలి, దయ చూపే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. 1995 నవంబర్‌లో రాజ్ కుమార్ అనే వ్యక్తి అమ్మిన పాలను ల్యాబ్‌లో పరీక్షించగా కొవ్వు శాతం కేవలం 4.6 గానూ, కొవ్వు కాని ఘన పదార్థం (ఎమ్ఎస్ఎన్ఎఫ్) 7.7 శాతం ఉన్నట్టు తేలింది. అయితే ఆహార కల్తీ నిరోధక చట్టం నిబంధనల ప్రకారం అది 8.5 శాతంగా ఉండాలి.


దీంతో అప్పట్లోనే ట్రయల్ కోర్టు కుమార్‌ను దోషిగా గుర్తించింది. ఇదే తీర్పును సెషన్స్ కోర్టు, హైకోర్టులు కూడా సమర్థించాయి. అయితే పాల శాంపిల్‌ను పరీక్షించడంలో జాప్యం జరిగిందనీ అందు వల్ల స్వల్ప తగ్గుదలను పట్టించుకోవాల్సిన అవసరం లేదంటూ రాజ్ కుమార్ తరపు లాయర్ వాదించాడు. ఈ కేసు 24 ఏళ్ళ నాటిది కావడంతో తన క్లయింట్ పట్ల కనికరం చుపించాలంటూ కోర్టులో అభ్యర్ధించారు. 


అయితే జస్టిస్ దీపక్ గుప్త, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం నిందితుడిపై కనికరం చూపేందుకు నిరాకరించింది. నిందితుడు ఆరునెలల పాటు జైలు శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేసింది. చట్టసభలో ఒక్కసారి ప్రమాణాలను నిర్దేశించిన తర్వత వాటిని అనుసరించాల్సిందేనని స్పష్టం చేసింది. ఏదిఏమైనా ఏది ఓ విచిత్రమైన కేసు.. 24 ఏళ్ళ నుంచి ఈ కేసు జరుగుతుంది అనేది విచిత్రమైనది అనే చెప్పాలి. ఇంతవరుకు జైలు శిక్ష అనుభవించకూడదు అని అనుకున్న చివరికి అతగాడు జైలు శిక్ష అనుభవిచాల్సి వచ్చింది. ఈ ఘటనను చూసి అయినా పాలవారు పాలలో నీళ్లు కలపకుంటే మంచిది. మీరు పది రూపాయలు ఆశించి నీళ్లు కలిపారు అంటే 24 ఏళ్ళు ఇలా కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: