ఆంధ్రప్రదేశ్‌లో భూముల రీ సర్వేకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా 3 కోట్ల 31 లక్షల ఎకరాల భూమిని రీ సర్వే చేయించనుంది ప్రభుత్వం. భూ రికార్డులను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసే దిశగా చర్యలు చేపడుతోంది జగన్‌ సర్కార్‌. 


రాష్ట్ర వ్యాప్తంగా భూముల రీ సర్వే కోసం అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు ఏపీ ఉపముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్. రాష్ట్ర వ్యాప్తంగా 3.31 కోట్ల ఎకరాల భూమి ఉందన్న డిప్యూటీ సీఎం, రీ సర్వే చేస్తున్నామని చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించిన టెండర్లు ఇప్పటికే ఖరారయ్యాయని తెలిపారు. ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరిస్తున్నా టెండర్లపై భిన్నమైన కథనాలు వచ్చాయంటూ వాటికి సంబంధించిన ఫైలును మీడియా ముందుంచారు డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్.  


పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో అనవసరమైన నిబంధనలను పక్కన పెడతామని వివరించారు పిల్లి సుభాష్ చంద్రబోస్... ఇళ్ల పట్టాలు ఇవ్వాలన్న సీఎం జగన్ నిర్ణయం మేరకు ప్రత్యేకంగా సబ్ కమిటీ వేశామని తెలిపారు. వివిధ శాఖలకు చెందిన సెక్రటరీలతో సమావేశమయ్యామని,  చిన్న చిన్న కారణాలతో ఇళ్ల స్థలాల లబ్దికి అనర్హులని ప్రకటించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు.   


అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లు, హైకోర్టు అడ్వకేట్ లు, జర్నలిస్టులకు ఇవ్వాల్సిన ఇళ్ల స్థలాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్నామన్నారు డిప్యూటీ సీఎం పిల్లి  సుభాష్ చంద్రబోస్. ఈ వర్గాలకు సంబంధించి ఎంత మంది అర్హులు ఉంటారన్న వివరాలను  సేకరించి, వారికి ఇళ్లస్థలాలు ఇవ్వమంటూ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇయ్యాలని నిర్ణయించామని వివరించారు. ఇదిలా ఉంటే.. అర్చకులు, ఇమామ్ లు, పాస్టర్లు, హైకోర్టు అడ్వకేట్ లు, జర్నిలిస్టుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. అసలైన అర్హులకు అభివృద్ధి ఫలాలు అందితే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.  మరి చూడాలి ఏపీ ప్రభుత్వం చెప్పినట్టుగా జరిగితే మంచిదే కదా..!




మరింత సమాచారం తెలుసుకోండి: