ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్‌ ప్రయాణికులపై భారీగానే పడింది.సమ్మె మొదటి రోజు శనివారం ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో ఆర్టీసీ ఉద్యోగులు కార్మికులు విధులను బహిష్కరించారు. భువనగిరి పట్టణం నుంచి అలస్యంగా బస్సులు రాకపోలు సాగించాయి.దీంతో యాజమాన్యం ప్రైవేటు సిబ్బందితో బస్సులు నడిపింది.ఉదయం 4గంటలకు బయలు దేరాల్సిన బస్సులు సుమారు 2 గంటలు ఆలస్యంగా బయలు దేరాయి.


సింగిల్‌ రూట్లలో బస్సులను పూర్తిగా నిలిపేశారు. ఖమ్మం డిపోనుంచి ఇల్లెందుకు పోలీస్‌ ఎస్కార్ట్‌తో తొలి బస్సును నడిపారు. ఖమ్మం రీజియన్‌లోని ఆరు డిపోల పరిధిలో 632 బస్సులు ఉండగా..ఇందులోంచి 398 బస్సులు రోడ్డెక్కాయి. వీటిలో 225 ఆర్టీసీ బస్సులు కాగా 173అద్దె బస్సులు ఉన్నాయి.ఆర్టీసీ బస్సులను ప్రవేటు కండక్టర్లు, డ్రైవర్లతో నడిపారు.ఖమ్మం జిల్లాలో 63శాతం బస్సులు నడిచాయి. 37 శాతం బస్సులు డిపోల నుంచి కదలలేదు.ఇక హైదరాబాద్‌–వరంగల్,నల్లగొండకు వెళ్లే మార్గంలో ఉదయం మాత్రమే బస్సులు నడిచాయి.


మోత్కూర్, గజ్వెల్‌ రోడ్డు మార్గంలో అలస్యంగా బస్సులు రావడంతో పాటు తక్కువ సంఖ్యలో బస్సులు ఉండడంతో బతుకమ్మ, దసరా పండుగకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను అశ్రయించారు.ఈ మార్గంలో అదనంగా రూ.10 నుంచి రూ. 20 వరకు చార్జీలను వసూళ్లు చేశారు.దీంతో ప్రయాణి కులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉదయం ఏసీపీ భుజంగరావు బస్టాండ్‌లో ప్రయాణికులతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నమని చెప్పారు.కంట్రోల్‌ ఉండే స్థానంలో పోలీసులు ఉంటూ బస్సుల రాకపోకల వివరాలను నమోదు చేసుకున్నారు.


మొత్తం మీద నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్‌లో సమ్మె సందర్భంగా అంతగా ప్రయాణికులు కనిపించలేదు.ఇక పోతే ఆర్టీసీని ప్రభుత్వలో విలీనం చేయడంతో పాటు కార్మికుల సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టిన సంగతి తెలిసిందే.ఈ సమ్మె వల్ల ఎలాంటి  ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోకుండా అన్ని డిపోల వద్ద భారీ బందోబస్తు ను పోలీస్‌లు ఏర్పాటు చేసి 144వ సెక్షన్‌ను అమలు చేస్తున్నారు.ఇక ఆనందంగా ఊరెళ్లి గడపవలసిన పండగను రవాణా సౌకర్యాలు సరిగ్గా లేక కొందరు విరమించు కుంటున్నారు.ఇకపోతే ఇప్పుడున్న పరిస్దితుల్లో ప్రయాణం చేసే వారి పరిస్దితి వర్ణాతితం..

మరింత సమాచారం తెలుసుకోండి: