జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని రంగాల్లోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకుపోతున్నది. అభివృద్ధి విషయంలో జగన్ ఎంత ఖచ్చితంగా ఉంటారో.. తప్పు చేస్తే దండించే విషయంలో కూడా జగన్ అంతే ఖచ్చితత్వాన్ని పాటిస్తున్నారు.  చట్టం ముందు ఎవరైనా ఒక్కటే.. అలానే మనం అనుకున్న పని చేయడానికి మనసుకు నచ్చింది చేయడానికి కూడా జగన్ ప్రోత్సహిస్తున్నాడు. అందులో ఒకటి అరకు ఎంపీ వివాహం.  


వైకాపాలో చేరకముందు ఆమె ఒక టీచర్.  వయసు 25 లోపే ఉన్నది.  ఆమె ఓకే వ్యక్తిని ప్రేమించింది. అతని క్యాస్ట్ వేరు.  ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆమె అరకు నుంచి వైకాపా తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించింది.  ఎంపీ అయ్యాను కదా అని తన ప్రేమను పక్కనపెట్టలేదు.  ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుకోవాలని అనుకుంది.  జగన్ కూడా ఆమె నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలిపాడు. 

ఇటీవలే ఎంపీ గొడ్డేటి మాధవి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.  ఈనెల 17 వ తేదీన సంప్రదాయబద్ధంగా వివాహం జరగబోతున్నది. శరభన్నపాలెం అనే గ్రామంలో ఆమె వివాహం జరగబోతున్నది.  ఆ తరువాత విశాఖలో రిసెప్షన్ ను ఏర్పాటు చేస్తున్నారు.  ఇక ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి జగన్ హాజరుకాబోతున్నారు.  నూతన దంపతులకు జగన్ ఆశీర్వదించబోతున్నారు.  ఇక పార్లమెంట్ లోకి అడుగుపెట్టిన చిన్న వయసు కలిగిన మహిళగా గొడ్డేటి మాధవి గుర్తింపు పొందింది.  


మాధవి తండ్రి గొడ్డేటి దేముడు ఒకప్పుడు ఎమ్మెల్యేగా పనిచేశారు.  వామపక్షాలతో ఆయనకు మంచి పేరు ఉన్నది.  దేముడు అంటే ఆ ఏరియాలో మంచి గుర్తింపు ఉన్నది.  అయన కూతురు గొడ్డేటి మాధవి.  టీజర్ గా ప్రస్థానాన్ని ప్రారంభించిన మాధవి, ఆ తరువాత వైకాపాలో జాయిన్ అయ్యారు.  వైకాపా ఆమెకు అరకు ఎంపీ స్థానాన్ని కేటాయించింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై మాధవి భారీ మెజారిటీతో విజయం సాధించడం విశేషం.  


మరింత సమాచారం తెలుసుకోండి: