తెలంగాణలో నిన్న ప్రారంభమైన ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్ర రూపం దాలుస్తుంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం పూర్తిస్థాయిలో పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని తెలంగాణ ఆర్టీసీ జేఏసీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలోని అన్ని డిపోల వద్ద 144 సెక్షన్ విధించారు అధికారులు. అయితే ప్రభుత్వం ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అద్దె బస్సులు నడిపించేందుకు ప్రయత్నించగా వాటిని కూడా అడ్డుకుంటున్నారు కార్మికులు. అద్దె బస్సులను అడ్డుకున్న కార్మికులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.  దీంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తున్నాయి. 

 

 

 

 

 అయితే నేడు రాష్ట్రమంతటా బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న నేపథ్యంలో... ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా వినూత్న నిరసన తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చేస్తుండడంతో ప్రైవేటు అద్దె బస్సులను  ప్రభుత్వం నడుపుతుండటంతో  అవి నేరుగా బస్ డిపో లోకి వెళ్లి వస్తున్నాయి. అయితే ఆర్టీసీ కార్మికులు రెండవ రోజు సమ్మెలో భాగంగా బతుకమ్మలను డిపోల ముందు పేర్చి వినూత్న నిరసన తెలుపుతున్నారు. దమ్ముంటే వాటిని తొక్కించుకుని  వెళ్లాలని  అంటూ ఆర్టీసీ కార్మిక హెచ్చరిస్తున్నారు. దీంతో రాష్ట్రంలోని చాలా డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. అయితే రాష్ట్రంలో నిన్న తిరిగినన్ని బస్సులు కూడా ఈరోజు జరిగే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. 

 

 

 

 

 అయితే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ నుంచి కొన్ని స్పెషల్ బస్సులను పంప గా వాటిని శివార్లలోని అడ్డుకున్న ఆర్టీసీ కార్మికులు వెనక్కి పంపించేశారు. అయితే ప్రభుత్వం కొన్ని బస్సులను చతిప్పుతున్నపటికీ అవి పూర్తిస్థాయిలో ప్రయాణికుల అవసరాలను మాత్రం తీర్చడం  లేదు. అయితే ప్రస్తుతం నగరంలో సెవెన్ సీటర్ ఆటోలు, క్యాబులు,  కొన్ని ప్రైవేటు బస్సులు ప్రయాణికుల అవసరాలను తీరుస్తుండగా... మంగళవారంతో దసరా సెలవులు ముగుస్తుండటంతో ఆ సౌకర్యాలు కూడా ప్రజలకు దక్కే అవకాశం లేదు. ఒకవేళ ప్రభుత్వం కార్మికుల డిమాండ్ లపై ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే ప్రయాణికులకు తిప్పలుతప్పేలా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి: