తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో రాష్ట్రంలో అన్న క్యాంటీన్లు ప్రారంభం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్య పట్టణాలలో కాంట్రాక్టు గడువు ముగిసిన అన్న క్యాంటీన్లు జులై నెలలో మూతపడ్డాయి. అన్న క్యాంటీన్లను ఐదు రూపాయలకు ప్రజలకు అల్పాహారం, భోజనం అందించాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం దశల వారీగా ఏర్పాటు చేసింది. కాంట్రాక్టు గడువు పొడిగించడానికి వైసీపీ ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడంతో అన్న క్యాంటీన్లు మూతపడ్డాయి. 
 
రాష్ట్రంలోని అన్న క్యాంటీన్లను మూసివేయటంతో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో కొంత వ్యతిరేఖత వచ్చింది. తెలుగుదేశం పార్టీ నేతలు మరియు పేద ప్రజలు ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తం చేశారు. ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం కావటంతో వైసీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లను త్వరలోనే ప్రారంభిస్తామని ప్రకటన చేసింది. ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం మేరకు రాష్ట్రంలో అన్న క్యాంటీన్ల స్థానంలో రాజన్న క్యాంటీన్లు అతి త్వరలో ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. 
 
2020 జనవరి నెల 1వ తేదీన లేదా సంక్రాంతి పండుగ సందర్భంగా రాజన్న క్యాంటీన్లు ప్రారంభం కాబోతున్నాయని సమాచారం. వైసీపీ ప్రభుత్వం రాజన్న క్యాంటీన్లను పేద ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని కూడా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సీఎంగా జగన్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి ప్రజలకు మేలు చేసే ఎన్నో నిర్ణయాలను తీసుకున్నారు. 
 
2019 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారు. నాలుగు నెలల్లో 1,26,728 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను వైసీపీ ప్రభుత్వం కల్పించింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన వారు అక్టోబర్ 2వ తేదీన విధుల్లో చేరారు. అక్టోబర్ 4వ తేదీన వైయస్సార్ వాహన మిత్ర పథకం ద్వారా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రభుత్వం 10,000 రూపాయలు వారి బ్యాంకు ఖాతాలలో జమ చేసింది. అక్టోబర్ 10వ తేదీన వైయస్సార్ కంటి వెలుగు, అక్టోబర్ 15వ తేదీన వైయస్సార్ రైతు భరోసా పథకాలు ప్రారంభం కాబోతున్నాయి. జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కొరకు, ప్రజల సంక్షేమం కొరకు తీసుకుంటున్న నిర్ణయాల పట్ల ప్రజల్లో సంతృప్తి వ్యక్తం అవుతోంది. 
 
 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: