ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.  ప్రమాదంలో జరిగిన గాయాల కారణంగానే ఎక్కువగా మరణిస్తున్నారు.  సమయానికి అవసరమైన బ్లడ్ దొరక్కపోవడం వలనే మరణాలు సంభవిస్తున్నాయని ఇప్పటికే అనేక సర్వేల ద్వారా వెల్లడైంది.  అన్ని చోట్ల బ్లడ్ బ్యాంకులు అందుబాటులో ఉన్నప్పటికీ.. సమయానికి రక్తం దొరక్క మరణిస్తున్నారు .  ఒకవేళ దొరికినా.. వేళల్లో డబ్బులు పెట్టాల్సి వస్తుంది.  


ఈ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా శాస్త్రవేత్తలు అడుగులు వేస్తున్నారు.  అన్ని రకాల బ్లడ్ గ్రూపులకు ఒకేరమైన బ్లడ్ ను అందిస్తే చాలు.. గాయాల నుంచి బయటపడే విధంగా బ్లడ్ ను తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. మనిషి అన్ని రకాల వస్తువులను తయారు చేస్తున్నారుగాని, బ్లడ్ ను మాత్రం తయారు చేయలేకపోతున్నాడు.  ఇప్పుడు దాన్ని కూడా తయారు చేసేందుకు శాస్త్రవేత్తలు ట్రై చేస్తున్నారు.  


ఇలా కృత్రిమ పద్దతిలో బ్లడ్ ను తయారు చేస్తే.. మనిషి లైఫ్ కు తిరుగుండదు.  ఎలాంటి ప్రమాదం జరిగినా మనిషి గుండె ఆగిపోదు.  ఒకవేళ ఆగినా.. తిరిగి బ్రతికించేందుకు చికిత్స అందుబాటులోకి వస్తుంది. చెప్పాలి అంటే మనిషి సహజంగా పుట్టినా కృత్రిమంగా జీవిస్తాడన్నమాట.  కృత్రిమంగా జీవించే అవకాశం లభించడం అంటే మనిషికి మరణం లేనట్టే కదా.  


జపాన్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం ఇటీవల తొకోరోజవా నగరంలోని నేషనల్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్‌లో కృత్రిమ రక్తాన్ని రూపొందించారు. సాధారణ రక్తం తరహాలోనే ఇందులో కూడా ఆక్సిజన్ కలిగిన ఎర్ర రక్త కణాలను, చర్మం కోసుకున్నప్పుడు రక్తాన్ని గడ్డకట్టించే ప్లేట్‌లెట్స్‌ ఉన్నాయి. రక్తహీనత కలిగిన 10 కుందేళ్లపై ఈ రక్తాన్ని ప్రయోగించారు. 80శాతం సక్సెస్ అయ్యింది.  పది కుందేళ్ళలో 6 బ్రతికితే.. నాలుగు మాత్రం మరణించాయి.  ప్రయోగం చాలా వరకు సక్సెస్ కావడంతో 100శాతం సక్సెస్ అయ్యేందుకు అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.  


కుందేళ్ళ బ్లడ్ కు మనిషి బ్లడ్ కు దగ్గర సంబంధం ఉంటుంది.  మాములుగా బ్లడ్ ప్లేట్ లెట్స్ నాలుగు నుంచి 20 రోజుల వరకు మాత్రమే నిలువ ఉంటాయి.  ఆ తరువాత వాటి ప్రభావం కోల్పోతుంది.  శాస్త్రవేత్తలు డెవలప్ చేసిన కృత్రిమ బ్లడ్ సంవత్సరం వరకు నిలువ ఉంటుందని అంటున్నారు.  సో, ఇకపై ప్రమాదాలు జరిగినా కానీ, మనిషి మరణించే ఛాన్స్ లు చాలా వరకు తగ్గిపోతాయన్నమాట.  


మరింత సమాచారం తెలుసుకోండి: