చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ తాజాగా చంద్రుడి ఉపరితలం ఫోటోలను ఇస్రోకి పంపింది. ఆర్బిటర్‌లోని హై రెసొల్యూషన్‌ కెమెర తీసిన ఈ ఫొటోల్లో భారీ బిలాలు, బండరాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. చంద్రుడి ఉపరితల ఫొటోలను ఇస్రో విడుదల చేసింది.                             

                    

చంద్రుడి ఉపరితలానికి 100 కిలోమీటర్ల దూరం నుంచి చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ ఈ ఫొటోలు తీసింది. చంద్రుడికి దక్షిణ ధ్రువంలో ఉన్న బోగ్‌సలాస్కీ ఈ క్రేటర్‌ అనే ప్రాంతంలో ఈ ఫోటోలు ఒక భాగం. చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ తీసిన ఫోటోలలో వ్యాసం 14 కిలోమీటర్లు, లోతు 3 కిలోమీటర్లు ఉంది.                 

                           

కాగా నిన్న ఇస్రో చైర్మన్‌ శివన్‌ ఎనానమీ క్లాస్‌లో ప్రయాణించి మళ్లీ అందరి హృదయాలు గెలుచుకున్నాడు. ఇండిగో ఎకానమీ తరగతి విమానంలో ప్రయాణించి విమానంలో తోటి ప్రయాణికులను ఆశ్చర్యపరిచాడు. ఎకానమీ తరగతిలో శివన్ ప్రవేశించగానే తోటి ప్రయాణికులు అందరూ లేచి శివన్ కు అద్భుతమైన పద్దతిలో స్వాగతం పలికారు.

              

కాగా శివన్ విమాన సిబ్బందితో కాసేపు మాట్లాడారు. అనంతరం శివన్ తో సెల్ఫీ తీసుకునేందుకు సిబ్బంది, తోటి ప్రయాణికులు పోటీ పడ్డారు. ఆలా శివన్ తో సెల్ఫీ కోసం ఫోటి పడిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.                    

                                    

మరింత సమాచారం తెలుసుకోండి: