తెలంగాణలో హుజూర్ నగర్ ఉపఎన్నిక ఈనెల 21 వ తేదీన జరగబోతున్నది.  ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తెరాస పార్టీ చూస్తున్నది.  రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె జరుగుతున్నది.  ఈ సమ్మె ప్రభావం హుజూర్ నగర్ ఎన్నికపై పడే అవకాశం కనిపిస్తోంది. ఆర్టీసీ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని, ఆర్టీసీ తో పాటు ఉద్యోగాల కల్పన విషయంలో కూడా తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యిందని ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.  


కాగా, రాష్ట్రంలో సమ్మె రెండో రోజు కూడా కొనసాగుతోంది. ఈ రోజు ఈ సమ్మెపై కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు.  ఈ నిర్ణయంపైనే తెరాస ప్రభుత్వం ఆధారపడి ఉంటుందా అంటే ఏమో చెప్పలేం.  అయితే, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో తెరాస పార్టీకి మద్దతు ఇవ్వాలని వైకాపాను తెరాస పార్టీ కోరింది.  దీనికి ఆ పార్టీ కూడా సానుకూలంగా స్పందించింది.  తెరాస కు మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది.  తెరాస పార్టీకి వైకాపా మద్దతు ఇస్తుండటంతో కొంతమేర తెరాసకు కలిసి వస్తుంది.  


ఇక ఇదిలా ఉంటె, కాంగ్రెస్ పార్టీ ఇటీవలే జనసేన పార్టీ ఆఫీస్ కు వెళ్లి అక్కడి నేతలను కలిశారు.  హుజూర్ నగర్ ఎన్నికల్లో తమ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు.  అయితే, పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కేరళలో ఉన్నారు. ట్రీట్మెంట్ నుంచి తిరిగి వచ్చిన తరువాత జనసేన పార్టీ తన అభిప్రాయాన్ని చెప్పబోతున్నది.  సేవ్ నల్లమల సమయంలో జనసేన పార్టీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపింది.  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వీహెచ్ జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్ ను కలిశారు. 


సేవ్ నల్లమల విషయంలో పవన్ కు మద్దతు తెలిపారు.  జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యనేతలు అంతా హాజరయ్యారు.  దీంతో కాంగ్రెస్ పార్టీకి జనసేన దగ్గరవుతుందని వార్తలు వచ్చాయి.  ఇదే జరిగితే పార్టీకి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది.  అలా కాకుండా ఎవరికి మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉన్నా భవిష్యత్తులో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా మిగతా పార్టీలు మద్దతు ఇచ్చే విషయాన్ని ఆలోచిస్తాయి.  మరి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: