ఈమధ్య దొంగతనాలు చేసే స్టైల్ బాగా మారిపోయింది. టెక్నాలజీ పెరగడం ఏమో  కానీ దొంగల తెలివి  మాత్రం పీక్స్ లో పెరిగిపోతుంది. అయితే అందరూ దొంగలది ఓ  స్టైల్  అయితే... ఈ గజదొంగది  మాత్రం డిఫరెంట్ స్టైల్. సూటు బూటు... ఖరీదైన కారు... గ్రేడ్ బిజినెస్ మెన్  బిల్డప్ . కానీ చేసేది మాత్రం భారీ చోరీలు.  పైన పటారం లోన లొటారం అనే సామెతకు ఈ దొంగ కరెక్ట్ గా సరిపోతాడు. ఎందుకంటే చూడటానికేమో బిజినెస్  అవతారం యవ్వారం మాత్రం  దొంగతనాలు. నగరంలో కి ఎంట్రీ ఇచ్చి ఖరీదైన ఇల్లు లక్ష్యంగా టార్గెట్ చేసి... కోట్లకు కోట్లు దండుకుని  పక్క రాష్ట్రాలకు చెక్కేస్తాడు ఈ గజదొంగ . అసలు ఈ  దొంగ ఎవరు ఏం చేశాడో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.

 

 

 

 

 బీహార్లోని జోగియా  ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ హైదరాబాద్ వచ్చి తలబ్ కట్ట  ప్రాంతంలో బ్యాగులు కుట్టే  వ్యక్తి దగ్గర పనికి చేరాడు. చాలా ఏళ్ల పాటు పనిచేసి సడన్ గా  పని మానేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు .హైదరాబాద్ నుండి వెళ్లిన తర్వాత  ముంబై ఢిల్లీల్లో  ముజాహిద్ అనే స్నేహితుడితో కలిసి భారీ చోరీలకు పాల్పడ్డారు... దీంతో అక్కడి  పోలీసులు వీరిపై కన్నేయటం తో  అక్కడి నుంచి  బెంగళూరు కి మకాం మార్చాడు. అయితే రెండేళ్ల తర్వాత మళ్లీ బ్యాగులు కుట్టే తన యజమాని దగ్గరకు తన స్నేహితుడు  ముజాహిద్ తో కలిసి వచ్చాడు... కానీ ఒకప్పటిలా  కాదండోయ్ కాస్ట్లీ కారు,  సూటు బూటు తో వచ్చాడు ఈసారి. పెద్ద బిజినెస్ మాన్ గా మారనని తన గురువును నమ్మించాడు. ఇక ఇర్ఫాన్ ముజాహిద్ హైదరాబాదు వచ్చినప్పుడల్లా ఆయన ఇంట్లోనే మకాం  వేసేవారు. అయితే ఇక్కడ కాస్లీ ఇళ్లను గమనించి బెంగుళూరు వెళ్ళేవాళ్ళు. అయితే బెంగళూరులో ఉంటూనే హైదరాబాద్లో వాళ్ళు కన్నేసిన  ఇళ్లపై  చోరీకి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 28 లోని విల్లామేరీ కళాశాల యజమాని డాక్టర్ ఫిలోమినా ఇంట్లో సహా... పలుచోట్ల దొంగతనాలు చేసి కోట్లకు కోట్లు దోచుకెళ్లారు దొంగలు.

 

 

 

 

 అయితే కొన్ని నెలల క్రితం హైదరాబాద్ బంజారాహిల్స్ ఏరియాలో ఎమ్మెల్యే కాలనీ లోని డాక్టర్ రామారావు ఇంట్లో చోరీ జరగగా  అక్కడి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులకు... ఆ ఇంటికి పక్క సందులో కాస్ట్లీ కారు కనిపించింది. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు క్లూ తో కూపీ లాగారు. అయితే ఇర్ఫాన్  తో పాటు అతనికి సహకరించిన స్నేహితుడు ముజాహిద్ లను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గుర్తించి పట్టుకుని  విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: