మనసుకు ఏం అనిపిస్తే అలా చేయడం ఇప్పుడు యువతకు కామన్ అయ్యింది.  దాని వలన మంచి జరుగుతుందా ..చెడు జరుగుతుందా.. కెరీర్ కు ఇబ్బంది వస్తుందా.. అని ఆలోచించకుండా చేస్తున్నారు.  చివరకు ఇబ్బందుల్లో పడుతున్నారు.  సాంకేతికంగా ప్రపంచం అభివృద్ధి చెందిన తరువాత యూత్ కు ఎన్నో యాప్స్ పుట్టుకొచ్చాయి.  అలాంటి వాటిల్లో ఒకటి టిక్ టాక్ యాప్.  ఈ యాప్ ప్రతి ఒక్కరికి చేరువైంది.  


ఈ స్మార్ట్ వీడియో యాప్ లో వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.  ఇలా పోస్ట్ చేసిన వీడియోలు కొన్ని వైరల్ అవుతుంటాయి.  దీంతో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు వీడియోలు చేస్తూ టిక్ టాక్ లో పోస్ట్ చేస్తున్నారు.  వైరల్ అవుతున్నారు.  చివరకు ఇది ఎలా మారిపోయింది అంటే.. ఓ వ్యసనంగా మారిపోయింది.  ఈ వ్యసనంతో ఇబ్బందులు పడుతున్నాడు. 


రక్షించాల్సిన పోలీసులు సైతం టిక్ టాక్ యాప్ తో వీడియోలు చేస్తూ.. పాపులర్ కావాలని చూస్తూ ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు.  ఉద్యోగులు సైతం అలానే చేసి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు.  అయితే, పూణేలోని అసాబ్ సార్, బైక్రెయినగర్ ప్రాంతంలో ప్రయాణించే ప్రభుత్వ బస్సును ఆపి దాని ముందు బాలీవుడ్ పాటకు డ్యాన్స్ చేస్తూ టిక్ టాక్ చేసింది.  ఆ వీడియోను టిక్ టాక్ లో పోస్ట్ చేసింది.  


ఈ వీడియో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికీ వచ్చింది.  వెంటనే పోలీసులు ఈ విషయంపై సీరియస్ అయ్యారు.  వీడియో చేసిన యువతిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధం అయ్యారు.  టిక్ టాక్ వీడియో చేసేందుకు ప్రభుత్వ బస్సును ఆపడం ఏంటి దాని ముందు చిందులు వేయడం ఏంటి అని కొందరు విమర్శిస్తున్నారు.  అయితే, టిక్ టాక్ వీడియోలను దేశంలో బ్యాన్ చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: