దసరా, దీపావళి, సంక్రాంతి ఇంకా ఇలాంటి పెద్ద పండుగలు వచ్చినప్పుడు ఆఫర్లు ఆ కంపెనీ ఈ కంపెనీ అని లేకుండా ప్రతి ఒక్క కంపెనీ ఆఫర్స్ లిస్ట్ ప్రకటిస్తుంది. ఈ వర్గానికే సంబంధించిన బాంటియా కంపెనీ ఫర్నిచర్‌ ఏటా కస్టమర్లకు ఆఫర్లను ప్రకటిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ ఏడాది సాధారణంగా ఎవరైనా ఫ్లాట్‌ లేదా  ప్లాట్‌ కొంటే నజరానాలు ప్రకటిస్తారు. అయితే బాంటియా ఫర్నిచర్‌ షోరూం తమ కస్టమర్లకు ఫ్లాట్‌, ప్లాట్‌లు ఉచితం అని ప్రకటింది. 


కొన్నేళ్లుగా అమలు చేస్తున్న ఆల్టో కారు, యాక్టివా స్కీములకు తో డుగా ఈ కొత్త ఆఫర్‌ను ప్రకటించింది. బాంటియా షోరూంలలో రూ.4.99 లక్షల విలువైన ఫర్నిచర్‌ కొనుగోలు చేసిన వారికి సింగిల్‌ బెడ్‌ రూమ్‌ ఫ్లాట్, రూ.3.99 లక్షల విలువైన ఫర్నిచర్‌ కొనుగోలు చేసిన వారికి 100 గజాల ప్లాటు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 


యాదగిరి గుట్ట సమీపంలోని దత్తాయిపల్లి గ్రామ పరిధిలో డీటీసీపీ అప్రూవ్డ్‌ లేఅవుట్‌లో నిర్ణీత రిజిస్ట్రేషన్, డెవలప్‌మెంట్‌ చార్జీలు చెల్లించిన వారికి ఫర్నిచర్‌తో పాటే ఆయా ఫ్లాట్‌ లేదా ప్లాట్‌ రిజిస్ట్రేషన్‌ చేయించి ఇస్తారు. రూ.2.99 లక్షల ఫర్నిచర్‌ కొనుగోలు చేస్తే బీఎస్‌ 6, 2019 మోడల్‌ ఆల్టో ఎల్‌ఎక్స్‌ఐ కారు, రూ.99 వేల ఫర్నిచర్‌ కొనుగోలుపై హోండా యాక్టివా లేదా వెస్పాను ఉచితంగా పొందవచ్చు. 


ఇలా ఎంపిక చేసిన రిక్లైనర్‌ సోఫా సెట్‌తో పాటు రూ.55 ఇంచుల ఎల్‌ఈడీ టీవీని సైతం ఉచితంగా అందజేయనున్నారు. గతంలో మాదిరిగా కాకుండా ఈ సారి నిర్ణీత మొత్తానికి ఎంఆర్‌పీ ధరల్లో ఫర్నిచర్‌ కొనుగోలు చేసిన వారికి ఆయా ఆఫర్లు అందజేయనున్నారు. రూ.1 మాత్రమే చెల్లించి, మిగతామొత్తాన్ని సులభ వాయిదాల్లో చెల్లించే వెసులుబాటుకల్పిస్తున్నారు. పేటీఎం క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు వీటికి అదనం కూడా. ఇదేదో బాగుంది కదా ఒకసారి వెళ్లి చూసొద్దాం పదండి.


మరింత సమాచారం తెలుసుకోండి: