హుజూర్ నగర్ ఉపఎన్నిక ఫలితాలు.. కాంగ్రెస్ పార్టీ కంటే.. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కు వ్యక్తిగతంగా ప్రతిష్టాత్మకంగా మారాయి. కాంగ్రెస్ కంచుకోటగా పేరున్న నియోజకవర్గంలో తేడా కొడితే.. క్యాడర్ డీలా పడటంతో పాటు.. ఉత్తమ్ కూడా పార్టీలో బలహీనపడతారనే టాక్ వినిపిస్తోంది. హుజూర్ నగర్ ఫలితం మీదే ఉత్తమ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడిందనే చర్చ జరుగుతోంది. 


హుజూర్ నగర్ ఉప ఎన్నిక ఫలితాలు.. కాంగ్రెస్ తో పాటు ఉత్తమ్ రాజకీయ భవిష్యత్తును నిర్దేశించనున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ మెజార్టీ నేతలు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. హుజూర్ నగర్ ఉత్తమ్ సిట్టింగ్ స్థానం కాడవం, దానికి తోడు పీసీసీ చీఫ్ గా ఉన్న తరుణంలో.. గెలుపు తప్పనిసరి కానుంది. అభ్యర్థి కూడా ఉత్తమ్ సతీమణి పద్మావతి కావడంతో.. ఉత్తమ్ పై ఒత్తిడి ఇంకా పెరిగింది. గతంలో ఎప్పుడూ లేనంతగా నేతలు, క్యాడర్ ను సమన్వయం చేయడంలో ఆయన బాగా బిజీ అయ్యారు. ఇప్పటికే ముఖ్యనేతలకు పని విభజన చేశారు. 


హుజుర్ నగర్ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినా, ఓడినా ఫలితం ఉత్తమ్ అనుభవించాల్సి ఉంటుందనే వాదన ఉంది. ఎన్నికలకు ముందు... పార్టీ నాయకత్వం అంతా ఉత్తమ్ వెంట నిలబడింది. ఫలితాలు తేడాగా వస్తే... వ్యతిరేక స్వరం రావచ్చు. ఓడిపోతే.. కొత్తగా నాయకత్వం కోరుకునే వర్గం వాయిస్ పెంచే ఆలోచనలో ఉంది. అయితే నాయకత్వ మార్పు లాంటి అంశాలపై ఉత్తమ్ కూడా అంత ఆసక్తి కనబర్చడం లేదు. కానీ హుజుర్ నగర్ ఎన్నికల్లో పద్మావతి గెలిస్తే... నాయకత్వ మార్పు అంశం పక్కకు పోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి హుజుర్ నగర్ ఉప ఎన్నికల ఫలితాలు ... కాంగ్రెస్ తో పాటు..ఉత్తమ్ రాజకీయ భవిష్యత్ ని నిర్దేశించబోతున్నాయని గాంధీభవన్ లో చర్చ జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: