శనివారం నుండి చేపడుతున్న ఆర్టీసీ సమ్మె తో దసరా పండుగ దృశ్య తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు ప్రయాణికులు . ఆర్టీసీ కార్మికులు కరెక్ట్ గా దసరా పండుగ సీసన్ చూసి సమ్మెకి దిగటంతో ప్రయాణికుల ఇబ్బందులు అన్ని ఇన్ని కావు...దసరా పండుగ కావటం తో ఇళ్లకు బయలుదేరిన ప్రయాణికులు రోడ్డు పై పడిగాపులు కాస్తున్నారు. అటు కార్మికులు  కోసం తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేయడంతో ప్రయాణికులు  ఆందోళన చెందుతున్నారు. 

 

 

 

 ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రవేట్  వాహనదారులు కూడా భారీగా చార్జీలు పెంచి డబ్బులు దండుకుంటున్నారు. అయితే ప్రయాణికుల  సౌకర్యార్థం  ప్రభుత్వం కొన్ని అద్దె ప్రైవేటు బస్సులు నడుపుతున్న అప్పటికి అవి  పూర్తిస్థాయిలో ప్రయాణికుల అవసరాలను మాత్రం తీర్చడం లేదు. దీంతో ప్రయాణికులకు  ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి హైదరాబాద్ మెట్రో పై  మళ్ళింది. ఆర్టీసీ సమ్మెతో ప్రైవేటు వాహనాలు భారీగా ఛార్జీలు పెంచడంతో... అందరికీ మెట్రో రైల్ యే  దిక్కయింది. 

 

 

 

 అన్ని మెట్రో  స్టేషన్ లలో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రైవేట్ వాహనాలలో  అధిక చార్జీలు చెల్లించి వెళ్ళడం కంటే మెట్రోలో వెళ్లడం మేలు అని ప్రయానికులు భావిస్తున్నారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం కూడా మెట్రో ట్రైన్ ల ట్రిప్పుల ను పెంచుతుంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రయాణికులందరూ మెట్రో స్టేషన్లకు తరలిరావడంతో హైదరాబాద్ మెట్రో రైలు సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఆర్టీసీ సమ్మె ఎఫెక్టుతో శనివారం ఒక్కరోజే 3.65 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చింది హైదరాబాద్ మెట్రో. అయితే గతంలో 3.06 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చి   రికార్డు సృష్టించిన మెట్రో...  సమ్మె ఎఫెక్ట్ తో ప్రయాణికులు ఎక్కువగా మెట్రో పై మొగ్గు చూపటం తో పాత  రికార్డుల్ని తిరగరాసింది హైదరాబాద్ మెట్రో. ప్రయాణికుల సౌకర్యార్థం ప్రతి మూడు నిమిషాలకు ఒక రైలు నడిచేలా ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ మెట్రో తో ప్రయాణికులకు  కాస్త ప్రయాణభారం తగ్గినట్లే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: