వానొచ్చేనంటే వరదోస్తాది..వరదొచ్చేనంటే ముంచేస్తది అని అన్నట్టు. ఏడు రోజులుగా బిహర్ రాజధాని పాట్నా నగరం సగానికి పైగా ముంచేసింది.72 గంటల్లో సుమారు 300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.లోతట్టు ప్రాంతాలు అన్ని నీళ్లతో మునిగిపోయ్యాయి.పడవలు రోడ్లపైకి రావడం కనిపించింది. ప్రజలు నీళ్లలో గడపాల్సి వచ్చింది.వర్షం ఆగినా రోడ్లపై నీరు అలాగే ఉండిపోయింది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇళ్లు ఖాళీ చేసి ఎత్తైన భవనాలపైకి వెళ్లిపోయినా కూడా అక్కడి దాకా నీరు రావడం విశేషం.వరద నీటిలో చిక్కుకున్న జంతువులు సహాయం కోసం ఎదురుచూపులు చూస్తుండి పోయాయి. వరద ముప్పు వల్ల జరిగిన నష్టాన్ని ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు.కానీ, వరద నీరు తగ్గుతున్న కొద్దీ నీటి తీవ్రత ఎక్కువైపోతుంది.

బేవుర్, రామకృష్ణ నగర్, ఇంద్రపురి, శివపురి, కంకర్‌బాగ్ వంటి అనేక నివాస ప్రాంతాల్లో ఆరు నుంచి ఏడు అడుగుల లోతుల వరకు నీరు ఆగిపొయ్యి అస్తవ్యస్తమైపోతుంది.చాలా రోజుల నుంచి నీళ్లు ఆగిపోవడంతో సిటీలో సైతం  అంటువ్యాధులు ఘోరంగా వ్యాప్తి చెందుతున్నాయి.

నీళ్లు ఎక్కువ సమయం ఎందుకు నిలిచిపోతున్నాయో అర్థం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

వాతావరణ మార్పుల వల్ల అధికంగా వర్షాలు పడ్డాయని ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చెబుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్లనే ఇది జరిగిందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

అటు కంకర్‌బాగ్‌లో వారం రోజుల నుంచి నీటిమయమైన తన ఇంట్లో నుంచి సీనియర్ జర్నలిస్ట్ లవ కుమార్ మిశ్రా మాట్లాడుతూ, ''అధికారులు, ప్రజాప్రతినిధులు పనిచేయడానికి సిద్ధంగా లేనందువల్ల నీళ్లు బయటకు పోవడం లేదని'' అని ఘాటుగా విమర్శించారు.

ఇంట్లో నీటిని తోడే పంపులు కూడా నీటిలోనే మునిగిపోయాయి. ఇక వర్షం తగ్గిన రోజు విలాస్ పూర్‌లోని ఎస్‌ఈసీఎల్ సంస్థ భారీ పంపులతో వీఐపీ ప్రాంతాల్లో నీటిని తోడే పనులు ప్రారంభించింది. ముఖ్యమంత్రి నితీశ్, మంత్రుల నివాసాల వద్ద చేరిన నీటిని తోడేశారు'' అని ఆయన పేర్కొన్నారు.చూద్దాం వరద తగ్గి శస్యశ్యామలం గా మారాలని అందరం ఆశిద్దాం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: