ఈ ప్రపంచంలో ఎన్నో వింతలు విశేషాలు ఉన్నాయి.  వింతలు విశేషాల గురించి తెలుసుకోవాలని అందరికి ఉంటుంది. ఒక్కోసారి కొన్ని విచిత్రమైన సంగతులు జరుగుతుంటాయి.  కొన్ని సంఘటనలు నవ్వు తెప్పించే విధంగా ఉంటె మరికొన్ని మాత్రం ఆలోచింపజేసే విధంగా ఉంటాయి.  ఇలాంటి వాటిల్లో ఒకటి నెదర్లాండ్స్ లో జరిగింది. నెదర్లాండ్ కు చెందిన ఓ దొంగ ఓరోజు రాత్రి షట్టర్ కట్ చేసి ఎత్తి లోపలికి వెళ్లి దొంగతనం చేసేందుకు ప్రయత్నం చేశాడు. 


అయితే, లోపలికి వెళ్లిన తరువాత ఎదో అలజడి జరిగింది.  భయం వేసిన ఆ వ్యక్తి తిరిగి బయటకు వచ్చేశాడు. అయితే, లోపల ఉన్న సీసీ కెమెరాల సహాయంలో పాపం ఆ దొంగగారానికి పట్టుకున్నారు.  జైల్లో పెట్టారు.  ఇక్కడ విషయం ఏమిటంటే.. దొంగతో పాటుగా ఓ చిలుకను కూడా జైల్లో పెట్టారు.  దానికి బెడ్డు, బ్రేడ్, నీళ్లు ఇచ్చారు.  ఈ విషయం అక్కడి మీడియా ద్వారా బయటకు రావడంతో ఒక్కసారిగా యానిమల్ వెల్ఫేర్ వాళ్ళు విమర్శలు చేయడం మొదలుపెట్టారు.  


అయితే, దీనికి పోలీసువారు ఇచ్చిన సమాధానం భలే విచిత్రంగా ఉంది.  దొంగతనం జరిగినపుడు చిలుక కూడా ఆ వ్యక్తి భుజంపైనే ఉందని, అందుకే దాన్ని కూడా లోపల ఉంచామని, అది ఆ వ్యక్తి అనుమతితోనే చేసినట్టు చెప్పారు.  ప్రత్యేకమైన పంజరం లేకపోవడం వలనే లోపల ఉంచినట్టు చెప్పారు పోలీసులు.  దాన్ని అరెస్ట్ చేయలేదని, సాక్ష్యంగా మాత్రమే ఉంచినట్టు చెప్పారు.  


చిలుక సాక్ష్యంగా ఉంచడం ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు.  కొన్ని రోజుల తరువాత ఆ దొంగతో పాటు చిలుకను కూడా వదిలేసారు.  అది వేరే విషయం అనుకోండి.  అయితే, ఈ న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేగింది.  ఇటు ఇండియాలో కూడా ఈ న్యూస్ గురించి మాట్లాడుకుంటున్నారు.  చిలుక రాములువారితో సమానం అని దానిని జైల్లో ఎలా ఉంచుతారని, అది చాలా అర్ధం అని కొందరంటే.. వాళ్లకు ఆ విషయాలు తెలియవుకదా అందుకే అలా చేశారని కొందరు సర్ది చెప్తున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: