నందిని నందిగా పందిని పందిగా ఎప్ప‌టికైనా అనాల్సిందే.. ఎందుకంటే నంది ఏనాడు పందిగా, పంది ఏనాడు నందిగా మార‌దు.. కానీ రాజ‌కీయాల్లో కొంద‌రు నందిని పందిగా, పందిని నందిగా వ‌క్రీక‌రించి చెప్పి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఏపీలో ఓ సంఘ‌ట‌న సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని స్వాగ‌తిస్తుంటే.. ఇదే సంఘ‌ట‌న‌పై అతిగా స్పందించిన ప్ర‌తిప‌క్ష నేత‌ల‌ను ప్ర‌జ‌లు దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పుడు జ‌రిగిన సంఘ‌ట‌న అవాంఛ‌నీయ‌మైన‌ప్ప‌టికి ఇది ఒకందుకు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఎంతో మేలు చేసింద‌నే చెప్పాలి.


ఎందుకుంటే ఏదైనా సంఘ‌ట‌న జ‌రిగిందంటే.. దాని వెనుక అర్థం ప‌ర‌మార్థం ఉంటుంది. న‌ష్టం భారీగా ఉన్న‌ప్పుడు న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు తీసుకోవ‌డం పైనే నాయ‌కుడి స‌మ‌ర్థ‌త అధారప‌డి ఉంటుంద‌నేందుకు ఇప్పుడు ఏపీలో జ‌రిగిన సంఘ‌ట‌నే నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. అందుకే ఆ ఎమ్మెల్యే చేసిన చ‌ర్య‌తో సీఎం ఇమేజ్‌కు మ‌చ్చ తెచ్చేదిగానే ఉన్న‌ప్ప‌టికి దాన్ని త‌న రాజ‌కీయ చ‌తుర‌తో ఎంతో చ‌క్క‌గా స‌మ‌ర్థవంతంగా ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా, త‌న‌కు ఎలాంటి డామేజ్ జ‌రుగ‌కుండా ప‌నికానిచ్చారు..  ఓ మోటు సామేత ప్ర‌కారం పాము చావ‌కుండా, క‌ర్ర విరుగ‌కుండా వ్య‌వ‌హారం చ‌క్క‌బ‌డాలే అనేదానిని చాలా లౌక్యంగా ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న ఇమేజ్‌ను అమాంతం పెంచుకున్నారు.


అదే సంద‌ర్భంలో ప్ర‌తిప‌క్ష నేత ఇమేజ్‌ను అమాంతం డామేజ్ చేయ‌డం ఇక్క‌డ సీఎం జ‌గ‌న్ ప‌నితీరుకు, నాయ‌క‌త్వ ప్ర‌తిభ‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది. ఇంత‌కు అస‌లు విష‌యానికి వ‌స్తే.. నెల్లూరు రూర‌ల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి ఏపీ సీఎం జ‌గ‌న్‌కు న‌మ్మిన‌బంటు. ఆ ఎమ్మెల్యే వ్య‌వ‌హార‌శైలీ మొద‌టి నుంచి వివాదాస్ప‌ద‌మే. ఏదీ చేసినా దుందుడుకుగా చేస్తారు. వెనుకాముందు ఆలోచించ‌రు.. త‌రువాత దానిని క‌వ‌ర్ చేయ‌డం జ‌గ‌న్‌కు మొద‌టినుంచి వ‌స్తున్న ఆన‌వాయితీ. అయితే ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు ఎంత దుందుడుకుగా ఉన్నా అది చెలామ‌ణి అవుతుంది. ఎందుకంటే ప్ర‌తిప‌క్షం ఎంత దుందుడుకుగా ఉంటే అంత మేలు క‌లుగుతుంది.


అదే అధికార ప‌క్షంలో ఉన్న‌ప్పుడు దుందుడుకు స్వ‌భావం ప‌నికి రాదు. దీంతో ఏ ఒక్క చిన్న పొర‌పాటు జ‌రిగినా అది స‌ర్కారు కు మ‌చ్చ తెస్తుంది. నాయ‌కుడికి చెడ్డ‌పేరు తెస్తుంది. ఇప్పుడు కోటంరెడ్డి వ్య‌వ‌హ‌రించిన తీరు అలాగే ఉంది. ఇంకా కోటంరెడ్డి ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ట్లుగానే భావిస్తున్న‌ట్లు ఉన్నారు. అందుకే అధికారుల‌తో ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్ప‌టి దుందుడుకు స్వ‌భావంతోనే వ్య‌వ‌హ‌రిస్తూ ఏపీ సీఎం జ‌గ‌న్‌కు త‌ల‌నొప్పిగా మారాడు. అయితే గ‌త రెండు రోజుల క్రితం నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి ఎంపీడీఓ స‌ర‌ళ‌ను దూషించి బెదిరించిన సంఘ‌ట‌న‌లో కేసులో ఇరుక్కున్నారు. ఓ మ‌హిళా ఎంపీడీఓను కోటంరెడ్డి దూషించి పెద్ద త‌ప్పే చేశారు. ఎందుకంటే అధికార ప‌క్షంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్షాల‌కు అవ‌కాశం ఇవ్వ‌కూడ‌దు అనే క‌నీస అవ‌గాహ‌న లేక‌పోవ‌డమే. అయితే ఎంపీడీవోను దూషించినందుకు ప్రతిప‌క్ష నేత చంద్ర‌బాబు ఎంతో హడావుడి చేశారు. జ‌గ‌న్ స‌ర్కారు రాక్ష‌స స‌ర్కారు, నియంత స‌ర్కారు, నిరంకుశ స‌ర్కారు అంటూ దుయ్య‌బ‌ట్టారు.


మ‌హిళా ఉద్యోగుల‌కు ర‌క్ష‌ణ లేద‌ని చిందులు తొక్కారు.. ఆయ‌న కొడుకు లోకేష్‌ కూడా ఇక పిట్ల అరుపులు బాగానే అరిచాడురు.. అయితే ఈ అరుపుల‌ను ప‌ట్టించుకోని సీఎం జ‌గ‌న్ ఎమ్మెల్యే కోటంరెడ్డి త‌ప్పు చేస్తే వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని పోలీస్ బాస్‌ను అదేశించ‌డం, పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేయ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. అయితే త‌న పార్టీ ఎమ్మెల్యే.. త‌న‌కు న‌మ్మిన‌బంటు.. త‌న‌తో క‌ష్ట‌కాలంలో కూడా తోడు నీడ‌గా ఉన్న ఎమ్మెల్యేను అరెస్ట్ చేయించిన సీఎం జ‌గ‌న్ త‌న మార్క్ పాల‌న‌ను రుచిచూపారు. త‌ప్పు చేస్తే నా అన్న‌వారు ఎవ్వ‌రు లేరు... ఎవ్వ‌రైనా చ‌ట్టం దృష్టిలో స‌మాన‌మే.. అంటూ నిరూపించారు. ఇప్పుడు జ‌గ‌న్ చ‌ట్టం ప‌నిని తూచ త‌ప్ప‌కుండా చేయించి ఇమేజ్‌ను అమాంతం పెంచుకున్నారు. అదే సంద‌ర్భంలో ప్ర‌త‌ప‌క్ష నేత చంద్ర‌బాబు ఇమేజ్ ను పూర్తిగా డామెజ్ చేశారు.


టీడీపీ పాల‌న‌లో, చంద్రాలు స‌ర్కారులో ఆయ‌న అనుచ‌ర దెందులూరు ఎమ్మెల్యే చింత‌మ‌నేని  ప్ర‌భాక‌ర్ ఇసుక మాఫీగా మారి, అక్ర‌మ ఇసుకను ర‌వాణా చేస్తుండ‌గా ఎమ్మార్వో వ‌న‌జాక్షి అడ్డుకోగా స్వ‌యంగా ఎమ్మెల్యేనే ఆమెపై దాడి చేసి కొట్టారు. ఇవి వీడియో పుటేజ్‌ల్లో బ‌హిరంగం అయింది. అయినా ఆనాడు బాబు క‌నీసం ఎమ్మార్వోపై దాడి చేసిన ఎమ్మెల్యేను మంద‌లించ‌లేదు స‌రికదా... ఎమ్మార్వోదే త‌ప్పు అని ఓ క‌మిటీని వేసి నిర్దార‌ణ చేయించారు. అంటే త‌న పాల‌న‌లో ఎమ్మెల్యే అధికారుల‌పై దాడులు చేస్తే అది ఎమ్మెల్యే త‌ప్పుగా కాకుండా దాడికి గురైన అధికారిదే త‌ప్పు అని తేల్చి వేసి తీవ్ర విమ‌ర్శ‌ల‌కు గుర‌య్యారు. అప్ప‌టి సంఘ‌ట‌న‌కు ఇప్ప‌టి సంఘ‌ట‌న‌కు పోలికి పెడితే ఇద్ద‌రు ఎమ్మెల్యేల తీరు త‌ప్పిద‌మే.. అయితే ఈ తప్పుల‌ను త‌ప్పుగా, ఒప్పును ఒప్పుగా స‌మ‌ర్థ‌వంతంగా ప‌రిష్క‌రించ‌డంలో, లౌక్యం ప్ర‌ద‌ర్శించ‌డంలో ఇద్ద‌రు నేత‌ల వ్య‌వ‌హార శైలీని పరిశీలిస్తే.. చంద్రాలు దోషిగా నిల‌బ‌డ‌టం ఖాయం.. 



మరింత సమాచారం తెలుసుకోండి: