వైఎస్సార్ అంటే తెలుగు ప్రజలకు విపరీతమైన అభిమానం. ఆయన చెప్పినవి చేశారు, చెప్పనివి కూడా చేశారు. అయిదేళ్ల పాటు అద్భుతమైన పాలన అందించారు. అందుకే ఆయన్ని రెండవమారు ప్రజలు ఎన్నుకున్నారు. ఇంకా వైఎస్సార్ ఏం చేస్తారో అని జనం గంపెడాశలు పెట్టుకుని ఉండగానే వైఎస్సార్ భువి నుండి దివికి వెళ్ళిపోయారు. ఓ విధంగా చెప్పాలంటే వైఎస్సార్ మీద జనాల  ఆశ, అభిమానం ఎక్కడా తగ్గలేదు. అందుకే జనం జగన్ని గెలిపించి ఆయన ఆశలను తీర్చమని కోరుకున్నారు


ఇక వైఎస్సార్ విగ్రహాలు వూరూ వాడా అభిమానులు ఏర్పాటు చేసుకున్నారు. ఇపుడు వైఎస్సార్ సర్కార్ ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇక వైఎస్సార్ కి మరింత గౌరవం ఇవ్వాలని ఆయన తనయుడు జగన్  సారధ్యంలోని ప్రభుత్వం నిర్ణయించింది.  అందులో భాగంగా అనేక పధకాలకు తండ్రి పేరు పెడుతున్నారు. ఇక వైఎస్సార్ అతి పెద్ద విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.


ఆ విషయాన్ని ఈ రోజు జలవరనుల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. పులిచింతల ప్రాజెక్ట్ వద్ద వైఎస్సార్ అతి పెద్ద విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. 45 అడుగుల వైఎస్సార్ విగ్రహంతో పాటు, ఆయ‌న స్మ్రుతివనం, పార్క్ కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. ఇక పులిచింతల ప్రాజెక్ట్ ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతామని కూడా తెలిపారు. ఓ విధంగా ఇది వైఎస్సార్ కే జలహారతి ఇచ్చినట్లుగా చెప్పారు.


జల యాగం చేసి అనేక ప్రాజెక్టులకు వైఎస్సార్ శ్రీకారం చుట్టారు. అందువల్ల ఆయన ఈ అరుదైన గౌరవానికి అర్హుడేనని చెప్పాలి. మొత్తం మీద చూసుకుంటే వైఎస్సార్ జనం గుండెల్లో చిరంజీవి. ఆయన ఎప్పటికీ కళ్ల ముందు నిలిచి ఉండేలా వైసీపీ సర్కార్ కూడా తగిన చర్యలు చేపడుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: