ఆంధ్రప్రదేశ్ యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికే ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకొని ప్రజల గుండెల్లో తన స్థానాన్ని సంపాదించుకుంటున్న సంగతి తెలిసిందే. పుట్టిన పిల్లల నుంచి వృద్ధుల వరుకు అందరికి ఉపయోగ పడే పథకాలు అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచార సమాయంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తున్నారు వైఎస్ జగన్. 

           

రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం ఒక్కో అడుగు వేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆంధ్రాలో ప్రైవేట్ మద్యం దుకాణాలను మూసివేసి ప్రభుత్వమే మద్యం దుకాణాలను తీసుకొచ్చింది. వీటితో పాటు మద్యం బాటిళ్ల పరిమితిని, మద్యం దుకాణాల పనివేళలను నియంత్రించింది.                          

               

అయితే తాజాగా మరో కొత్త విధానాన్ని సిద్దం చేసింది. వైన్ షాప్స్ లాగే బార్స్ సమయాన్ని కూడా తగ్గించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం బార్స్‌లో మద్యం విక్రయాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు జరుగుతున్నాయి. రాత్రి 11 తర్వాత మద్యం అమ్మవద్దని నిబంధన ఉన్నప్పటికీ బార్లలో ఈ నిబంధనను పట్టించుకోవడం లేదు.                   

                

ఈ నేపథ్యంలో బార్లలో సమయాన్ని కూడా కుదించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తుంది. మరి ఈ విషయం లో సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు అనేది త్వరలోనే తెలియనుంది. 

                 

మరింత సమాచారం తెలుసుకోండి: