ఇప్పుడు అంతా రాజ‌కీయాలు తెర‌వెనుక న‌డుస్తున్నాయి.. వీటిని న‌డిపిస్తున్న‌వారు అత్యంత శ‌క్తిమంతులై ఉంటున్నారు... వీరు చెబితే రాజ‌కీయ నేత‌ల‌కు, ప్ర‌భుత్వాధినేత‌ల‌కు ఎంతంటే అంతే.. వీరి ప్రాపకం సంపాదించిన వారికి రాజ‌కీయాల్లో ఇక తిరుగేలేదు.. వీరి ద‌ర్శ‌నం జ‌రిగిందో వారి ద‌శ తిరిగిన‌ట్లే.. అయితే అలాంటి ఒక పెద్దాయ‌న ద‌ర్శ‌నం ల‌భిస్తే ఏపీ సీఎం జ‌గ‌న్‌తో ప‌ని అయిపోయిన‌ట్లేన‌ట‌.. అంతే కాదు.. ఆయ‌న జ‌గ‌న్‌కు ఎంత చెపితే అంతేన‌ట‌.. ఆయ‌న మాట గిరిదాట‌డ‌ట సీఎం జ‌గ‌న్‌. అయితే ఇప్పుడు ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది. ఇంత‌కు జ‌గ‌న్‌ను శాసిస్తున్న ఆ అదృశ్య‌శ‌క్తి ఎవ‌రు.. ఆయ‌న ఏమీ చేస్తారు.. ఎక్క‌డుంటారు.. ఇంత‌కు జ‌గ‌న్‌కు ఆయ‌న ఏమ‌వుతారు... అనే ఆస‌క్తి నెల‌కొంది.. ఇంత‌కు ఆయ‌న ఎవ‌రో తెలుసుకోవాల‌ని ఉందా..


ఏపీ సీఎంకు దైవ‌భ‌క్తిని ఎక్కువ‌గా న‌మ్మ‌రు. స్వ‌త‌హాగా సీఎం జ‌గ‌న్ ఎక్కువ‌గా క్రైస్త‌వ మ‌తాచారాల‌ను ఆచ‌రించేవారు.. కానీ ఎందుకో స‌డ‌న్‌గా హిందూమ‌త విశ్వాసాల‌ను న‌మ్మ‌డం మొద‌లుపెట్టారు. అయితే ఇప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ ఎక్కువ‌గా ఆరాధించే వ్య‌క్తులు ఎవ‌రైనా ఉన్నారంటే.. అది కేవ‌లం శ్రీ స్వ‌రూపానందేంద్ర స్వామిజీనే. ఇత‌డు విశాఖ జిల్లా పెందుర్తికి చెందిన స్వామిజీ. ఇత‌డి మాటంటే జ‌గ‌న్‌కు వేద‌వాక్కు అని చెప్ప‌వ‌చ్చు.. అయితే ఇటీవ‌ల ఈ స్వామిజీ ఉత్త‌ర భార‌త‌యాత్ర‌లు ముగించుకుని విశాఖ పీఠం చేరుకోగానే రాజ‌కీయ భ‌క్తులు భారీగా క్యూ క‌ట్టార‌ట‌.. క్యూ క‌ట్టింది మామూలు రాజ‌కీయ నాయ‌కులు కాద‌ట‌.. రాజ‌కీయాల్లో త‌ల‌పండిన నేత‌లేన‌ట‌..


అంతే కాదు ఇందులో ఏపీ మంత్రి ఆవంతి శ్రీ‌నివాస్ కూడా స్వామీజీని కలిసి దాదాపు గంట‌ల త‌ర‌బ‌డి ఏకాంత చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌.. ఇటీవ‌ల ఆవంతి శ్రీ‌నివాస్‌కు ఓ పెద్ద స‌మ‌స్య వ‌చ్చింద‌ట‌.. టీడీపీలో స‌హ‌చ‌ర ఎమ్మెల్యేగా, మంత్రిగా ప‌నిచేసిన గంటా శ్రీ‌నివాస‌రావుతో ఆవంతికి పెద్ద క‌ష్టం వ‌చ్చింద‌ట‌.. టీడీపీలో గంటా శ్రీ‌నివాసరావు మంత్రిగా ప‌నిచేస్తే ఆవంతి శ్రీనివాస్ సాధార‌ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వైసీపీ తీర్థం పుచ్చుకున్న ఆవంతి శ్రీనివాస్ వైసీపీలో మంత్రిగా ఎంపిక‌య్యారు. అయితే గంటా ఇప్పుడు వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ద‌మ‌య్యార‌ట‌.. అయితే గంటా రాక‌ను అడ్డుకోక‌పోతే రాజ‌కీయంగా త‌న‌కు గ‌డ్డు రోజులు వ‌స్తాయ‌నే భ‌యంతోనే ఆవంతి శ్రీ‌నివాస్ గంటాను పార్టీలోకి తీసుకోకుండా సీఎం జ‌గ‌న్‌కు సందేశం పంపాల‌ని కోరార‌ట‌...


ఇక ఆవంతి శ్రీనివాస్‌తో పాటుగా మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీ‌నివాస్, టీడీపీ విశాఖ రూర‌ల్ జిల్లా  ఇన్‌చార్జీ పంచ‌క‌ర్ల ర‌మేష్‌బాబు వైసీపీలో చేరేందుకు స‌న్న‌హాలు చేసుకుంటున్న త‌రుణంలో స్వామిజీని క‌లిసి ఆశీర్వాదం  పొందార‌ట‌.. వీరితో పాటుగా స్వామిజీని అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌లు క‌ల‌వ‌డం సాధార‌ణ‌మేన‌ట‌. కానీ జ‌గ‌న్‌కు ఈ స్వామిజీ మంచి స్నేహితుడ‌ట‌..అందుకే ఈ స్వామిజీ ఏది చెబితే అదే న‌మ్ముతార‌ట‌.. అదే చేస్తార‌ట‌.. మ‌రి ఇప్పుడు స్వామీజీ గంటా రాక‌ను నిలువ‌రిస్తారా.. లేక గంటాను పార్టీలోకి తీసుకునేలా జ‌గ‌న్‌తో మాట్లాడుతారా..అనేది త్వ‌ర‌లో తేలిపోనున్న‌ది.. ఏదేమైనా వైసీపీ లో ఎవ‌రు ఏమీ చేయాల‌న్న‌, ఎవ‌రిని పార్టీలో చేర్చుకోవాల‌న్న స్వామిజీ చెప్పిందే జ‌గ‌న్‌కు వేద‌మట‌..


మరింత సమాచారం తెలుసుకోండి: