దేవుడిపై భక్తి ఉండొచ్చు.  ఆ భక్తి ఎక్కువగా కూడా ఉండొచ్చు.  అంతేగాని ప్రజలు ఇచ్చేంత భక్తి ఉండకూడదు.. గుండెలు కోసి ఇచ్చేంత భక్తి అస్సలు ఉండకూడదు.  అప్పుడు దాన్ని భక్తి అనరు.  మూఢ భక్తి అంటారు.  ఇలాంటి మూఢ భక్తిని ఒకప్పుడు అజ్ టెక్ అనే తెగజాతులు ప్రదర్శించేవారట.  దక్షిణ అమెరికాలో ఒకప్పుడు అజ్ టెక్ సామ్రాజ్యంలో ఇలాంటి విషయాలు సర్వసాధారణమే అని తెలుస్తోంది.  


దేవుడు ఇచ్చిన రక్తమాంసాలను దేవుడి కోసమే అర్పించడం గొప్పవిషయంగా భావించేవారట.  ఇక దేవుడికి బలికావడం అన్నది అక్కడ ఒక పవిత్ర కార్యంగా భావించేవారు.  అంతరిక్షాన్ని శోధించారు. కాలాన్ని గణించారు. భవిష్యత్తును అంచనావేశారు. మనకు అర్థంకాని ఎన్నో వింత ఆకారాలతో కట్టడాలు, శిల్పాలూ చెక్కి ఆశ్చర్యపరిచారు.  


దేవుడు ఇచ్చిన జన్మలో ఆ దేవుడి కోసం రక్తమాంసాలు ధారపోయడం గొప్ప అదృష్టంగా భావించేవారట.  అయితే, బలిఇచ్చే కార్యక్రమం చాలా దారుణంగా ఉండేదని చరిత్రకారులు చెప్తున్నారు.  బలిఇవ్వడం అన్నది వివిధరకాలుగా జరుగుతుందట.  బాణాలతో గుచ్చి చంపడం, నీళ్లలో ముంచి చంపడం, తగలబెట్టి చంపడం వంటి విధానాల ద్వారా బలి ఇచ్చేవారని చరిత్ర చెప్తోంది.  


ఇలా బలి ఇచ్చిన తరువాత ఆ మనిషి రక్తమాంసాలు వివిధ రకాలుగా ఉపయోగించేవారు.  తలను వేరు చేసి అలంకారంగా వేలాడదీయం, రక్తమాంసాలలో కొంత జంతువులకు వేయడం వంటివి చేసేవారు.  అలానే గుండెను తీసి దేవుడికి నైవేద్యంగా పెట్టేవారని చరిత్ర చెప్తున్నది.  ఇది చదవడానికి భయంకరంగా ఉంటె.. ఇక ఆ కాలంలో జరిగిన విషయాలని నిజంగా చూస్తే.. కళ్ళుతిరిగి పడిపోవడం ఖాయం.  సంవత్సరానికి కనీసం పదివేలమంది ఇలా బలి అయ్యేవారని పరిశోధనలను బట్టి తెలుస్తోంది.  మయన్లలో కూడా ఇలాంటి ఆచారాలు ఉండేవని పరిశోధకులు చెప్తున్నారు.  ఇలా బలి ఇవ్వడమే కాకుండా ఆ తెగలో ఇంకా అనేక ఆచారాలు ఉన్నాయని ప్రస్తుతం వాటి గురించి పరిశోధన చేస్తున్నట్టు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: