తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ ఆర్టీసీ) తప్పకుండా లాభాల్లో నడిచే సంస్థగా రూపు దిద్దాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఏదేమైనా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు  కలగకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాలలో అభివృద్ధి పధంలో పయనిస్తుందన్నారు. అదే విధంగా  ఆర్టీసీ కూడా ముందుండాలని ఆకాక్షించారు. దానికి అవసరమైనదంతా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తనకు అన్నింటికన్నా అత్యంత ప్రాదాన్యమయింది ఏంటంటే  తెలంగాణ గొప్ప రాష్ట్రంగా తయారు కావడమేనన్నారు.



భవిష్యత్ లొ ఆర్టీసిని ఏం చేయాలన్నా దృష్టిలో వుంచుకోవాల్సింది మొదట ప్రజలనేనని అన్నారు.  వాస్తవానికి ఆర్ట్టీసీలో నైపుణ్యమైన, వృత్తిపరమైన యాజమాన్యం వుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా అన్ని విధాలా స్థిరత్వం సాధించుకునే వెసులుబాటు కూడా ఉందన్నారు.  ఏదైనా నిర్ణయం తీసుకునే ముందర సమతుల్యం పాటించాలన్నారు. ఒక పక్క ప్రయివేట్ భాగస్వామ్యం, మరొక పక్క ఆర్టీసీ యాజమాన్యం వుంటేనే మంచిదని సీఎం కేసీఆర్ మరొక్క సారి నొక్కి చెప్పారు.




మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, చత్తీస్ ఘడ్, మణిపూర్ రాష్ట్రాలలో ఆర్టీసీ లేనే లేదని కేసీఆర్ ఈ సందర్బంగా ప్రస్తావించారు. బీహార్, ఒరిస్సా, జమ్మూ, కాశ్మీర్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్ ఉత్తర్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాలలో నామ మాత్రంగా వున్నాయని చెప్పారు. ఆ విధంగా చూస్తే కర్నాటక తరువాత తెలంగాణలో అత్యధికంగా బస్సులు నడుస్తున్నాయన్నారు. హైదరాబాద్ నగరానికి చెందినంత వరకు నష్టాలను ప్రభుత్వం భరిస్తుంది. ప్రస్తుతం 10400 బస్సులలో సుమారు కోటి మంది ప్రయాణం చేస్తున్నారు. భవిష్యత్ లో కూడా ఆ సౌకర్యం కొనసాగుతుందని చెప్పారు. ఇంత మంచిగా ఆర్టీసీని చూసుకుంటుంటే కార్మికులు సమ్మెకు దిగడం అవసరమా అని  ముఖ్యమంత్రి కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: