ఎస్వీబీసీలో పాటలు పాడటానికి వివిధ కచేరీలు, కార్యక్రమాల్లో పాల్గొనడానికి రూ.2లక్షలు పారితోషకం కావాలని టాలీవుడ్ నుంచి డిమాండ్లు వస్తున్నాయని ఎస్వీబీసీ చైర్మన్, సినీ నటుడు ఫృథ్వీ హాట్ కామెంట్ చేశారు.   తమకు కీరవాణి, సునీత లాంటి వాళ్లు అవసరం లేదని.. స్థానికంగానే అద్భుతమైన గాయకులు ఉన్నారని ఫృథ్వీ స్పష్టం చేశారు. స్థానిక కళాకారులతోనే మంచి కార్యక్రమాలు నిర్వహించి ఎస్వీబీసీ ప్రతిష్ట పెంచుతామన్నారు. నెలలో 20 రోజులు తిరుమలలోనే ఉండి స్వామికి సేవ చేస్తానని స్పష్టం చేశారు. 

 

 

 

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నడిచే భక్తి చానెల్ లో ఆధ్యాత్మిక కార్యక్రమాలను పెంచి మరింత వైభవం తెస్తామన్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ద్వారా భక్తుల్లో ఆధ్యాత్మిక భావన కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకు తగ్గ కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నామని అన్నారు. గతంలో ఎస్వీబీసీకి చైర్మన్ గా పనిచేసిన సినీ దర్శకుడు రాఘవేంద్రరావుకు గడ్డం ఉంటుంది.. నాకు ఉండదు అదే తేడా అని ఫృథ్వీ హాట్ కామెంట్ చేశారు. ఛానెల్ లో కొత్తగా ఏదైనా చేయాలనే ఆలోచన ఉందని.. ఎస్వీబీసీలోని ఉద్యోగులకు భద్రత సౌకర్యాలు, సరికొత్త టెక్నాలజీతో ఛానెల్ రూపురేఖలు మారుస్తానని అన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయని త్వరలోనే అమలుపరుస్తామని పృథ్వీ ఈ సందర్భంగా తెలిపారు.

 

 

 

సినిమాలలో తాను ఒక్క రోజు షూటింగ్ లో పాల్గొంటే 30 లక్షలు సంపాదించేవాడనని.. తిరుమల స్వామి కార్యంలో మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఎస్వీబీసీలో సేవ చేస్తున్నానని ఫృథ్వీ అన్నారు. విధి నిర్వహణలో తాను టీటీడీ వాహనాలు కూడా వాడడం లేదని క్లారిటీ ఇచ్చారు. ఎస్వీబీసీలో గతంలో జరిగిన అక్రమాలపై సీఎం కార్యాలయానికి ఫైల్ పంపిస్తానని కూడా ఫృథ్వీ అన్నారు. టీడీపీ హయాంలో జరిగిన ప్రతి పనికి సంబంధించి రిపోర్టులు బయటకు తీస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: