రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు  ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయం ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా ఉందని  బీజేపీ భావిస్తుందని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్. కె.లక్ష్యణ్ అన్నారు. తమ హెచ్చరికలను లెక్కచెయని వారందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించారు. ఏ కారణం లేకుండా ఈ ఏకపక్ష చర్య తీసుకునే హక్కు సిఎం కెసిఆర్‌కు లేదన్నారు. 
సీఎం  జారీ చేసే ఉత్తర్వులు కోర్టులలో సవాలు చేస్తే అవి నిలబడవన్నారు. వాస్తవానికి ఎప్పటికీ అమలు కావని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది ప్రజాసామ్య దేశమని మర్చిపోయినట్లు అనిపిస్తుందని ఎద్దేవా చేశారు. 



వేలాది మంది ఉద్యోగులపై రాత్రికి రాత్రి ఏకపక్ష నిర్ణయాలు తీసుకునే  హక్కు లేదన్నారు. ఆర్టీసీ సమ్మె పై బీజేపీ మొదటి నుండి హెచ్చరిస్తూ వస్తుందని ఈ సందర్భంగా లక్ష్యణ్ గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం  పోరాటంలో కెసిఆర్ వెంట ఉన్న ఆర్టీసీ కార్మికుల పై  అణచివేత ధోరణి అవలంబిస్తున్నారని బిజెపి భావిస్తుందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తొలగించాలనుకోవడం సిఎం కెసిఆర్ తన అనాలోచిత  నిర్ణయమన్నారు. దీంతో వేలాది మంది ఉద్యోగులు, వారి కుటుంబాలు పండుగ రోజున రోడ్లపైకి లాగడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడినందుకు రాష్ట్రంలోని ఉద్యోగులకు ఇచ్చే  బహుమతి ఇదా..అని సీఎం కెసిఆర్ ని సూటిగా ప్రశ్నించారు.
ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకునే ముందు సిఎం కెసిఆర్ ఆర్టీసీ జెఎసి నాయకులను ఒక్కసారి కూడా కలిసిన దాఖలాలు లేవని ఆయన ఆరోపించారు




ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు, డిమాండ్లను వెంటనే  పరిష్కరించడానికి ప్రయత్నించకుండా, సిఎం కెసిఆర్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.సమ్మె చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులను తొలగించాలనే ది , సీఎం కేసీఆర్ అనాలోచన నిర్ణయంగా బీజేపీ భావిస్తుందన్నారు.
ఉద్యోగుల తొలగింపు నిర్ణయం ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోకపోతే తీవ్ర  పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని లక్ష్యణ్ హెచ్చరించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: