నవరసాలలో ఒక రసం శృంగారం అంటారు. ఎందుకంటే బంగారం అందంగా ఉంటుంది.శృంగారం అంతకంటే అందంగా ఉంటుంది కాబట్టి,బంగారాన్ని మించిది శృంగారం అని అంటారు.ఇక ఈ శృంగారంతో ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా..మానసిక ఒత్తిడి తగ్గడం,ఒంట్లో కొవ్వు కరగడమే కాదు.తెలివితేటలు కూడా పెరుగుతాయట ! మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు.


లైంగిక కార్యకలాపాలు లేకపోతే మాత్రం జ్ఞాపకశక్తి ఏమాత్రం పెరగలేదని మేరీలాండ్ విశ్వవిద్యాలయముకు చెందిన మానసిక వైద్యనిపుణులు వెల్లడించారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని వాళ్లు గుర్తించారట. ఇక పోతే చాలమంది సెక్స్ ఎంత సేపు చేయాలి? శృంగారంలో ఎంత సమయం గడిపితే తమ భాగస్వామి సంతృప్తి చెందుతారు? లాంటి ప్రశ్నల గురించి ప్రతి జంట ఎప్పుడో ఓసారి ఆలోచించి ఉంటుంది. దీనికి సంబంధించి అమెరికా,యూకేలో 18-35 మధ్య వయసున్న 4వేల మంది మహిళలు,పురుషులపై నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తకిర విషయాలు వెలుగులోకి వచ్చాయి.


ఈ సర్వేలో గత 6 నెలలుగా సెక్స్‌లో యాక్టివ్‌గా పాల్గొంటున్న జంటలపై శృంగారానికి సంబంధించి పలు ప్రశ్నలు సంధించారట. ఈ సర్వేలో తేలిసిన ఆసక్తికరమైన  అంశాలు ఏంటంటే. పురుషుల కంటే మహిళలే ఎక్కువ సేపు సెక్స్ చేయాలని కోరుకుంటున్నట్టు తెలిసిందట. అదేంటంటే సగటున 25 నిమిషాల పాటు సెక్స్ చేస్తే తాము భావప్రాప్తి చెందుతున్నట్లు మహిళలు సర్వేలో వెల్లడించారట.


ఇక పురుషుల విషయానికి వస్తే తాము కూడ ఎక్కువ సమయం వరకు శృంగారం చేస్తే సంతృప్తిగా ఉంటుందని పేర్కొన్నారట. ఇక చాలమంది మహిళలు తెలిపిన విషయం ఏంటంటే తమ భాగస్వామి సగటున 11-14 నిమిషాలకు మించి సెక్స్ చేయలేక పోతున్నారని, అయితే తాము ఆసమయంలో ఎక్కువ సేపు శృంగారం కావాలని  కోరుకుంటున్నామని, తమ భాగస్వామి మాత్రం తొందరగా ముగించడం వల్ల అసంతృప్తికి లోనవ్వుతున్నామని ఈ సర్వేలో వెల్లడించారట..

మరింత సమాచారం తెలుసుకోండి: